తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త:
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం సతీ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈవో ఎవి ధర్మారెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి కె మిశ్రా కూడా వీరితో పాటు స్వామి వారిని దర్శించుకున్నారు.
Prajavartha Online Telugu News