గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థకు జరగనున్న ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్ఓ)ల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులపై సమగ్ర అవగాహన కల్గి ఉండాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధుల కేటాయించబడిన 30 మంది ఆర్ఓలు, 84 మంది ఏఆర్ఓలకు మాస్టర్ ట్రైనర్లతో ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పటికే ఎలక్ట్రోల్ రోల్ పబ్లిష్ చేయడం జరిగిందని, వార్డ్ ల రిజర్వేషన్ కోసం వారీగా జరిగే సర్వేని ఆర్ఓలు, ఏఆర్ఓలు పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ లిస్టు మేరకు రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలోని కేంద్రాల్లో నిర్దేశిత ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు మౌలిక వసతులను పరిశీలించి అనెగ్జలర్ 1లో గురువారం సాయంత్రానికి అందించాలన్నారు. అలాగే ఆర్ఓ కార్యాలయాలను కూడా ఫైనల్ చేయాలన్నారు. ప్రతి అధికారి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలతో కూడిన ఆర్ఓ బుక్ ని సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఏమైనా సందేహాలు ఉంటే నియోజకవర్గాల వారీగా కేటాయించిన డిప్యూటీ కమిషనర్లు, మాస్టర్ ట్రైనర్లతో మాట్లాడాలని సూచించారు. త్వరలో రాజకీయ పార్టీలతో నిర్వహించే సమావేశంలో ఆర్ఓలు పాల్గొనాలన్నారు. ప్రతి వార్డ్ కి ప్లానింగ్, అడ్మిన్ లతో ప్రత్యేకంగా ఎన్నికల విధులకు సహాయకారిగా ఉండెందుకు ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా చేయాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, ఏఓ తిరుపతి నాయుడు, మేనేజర్ బాలాజీ బాష, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News