Breaking News

వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఫిజియోథెరపీ…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయనం కేంద్రం వారు “వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఫిజియోథెరపీ’ అనే అంశంపై మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈనెల 28 నుండి 30 సెప్టెంబర్ 2022వ తేదీల్లో శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం అలిపిరి రోడ్డు తిరుపతి లోని వృద్ధులకు నిర్వహించారు వృద్ధులకు నిర్వహించారు. మహిళా అధ్యయన కేంద్రం లెక్చరర్ డాక్టర్ కే .రాణి వృద్ధాశ్రమంలోని వృద్ధులను ఉద్దేశించి కౌన్సిలింలో భాగంగా వృద్ధాశ్రమంలో వృద్ధులందరూ ఒకే కుటుంబంల కలిసిమెలిసి ప్రతి పరిస్థితుల్లోనూ సర్దుకుపోతూ సామరస్యంతో వ్యవహరించడం ద్వారా శేష జీవితం సంతోషంగా సాగుతుందని సూచించారు. తదుపరి కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్న సంరక్షణ ఫిజియోథెరపీ కేర్ institute ఫిజియోథెరపిస్ట్ డాక్టర్. డి.షర్మిల వృద్ధులకు ఆరోగ్య సమస్యలు అయిన మెడ నొప్పి, భుజముల నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులకు ఎక్సర్సైజ్ ధైరపీ మరియు ఎలక్ట్రికల్ ధెరిపీ ద్వారా ఉపశమనం కలిగించారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యయన కేంద్ర సిబ్బంది డాక్టర్ ఎం. ఇంద్రాణి మరియు ప్రీతి పద్మావతి వృద్ధాశ్రమ నిర్వాహకులు మునీంద్ర నాయక్ సంరక్షకురాలు మునెమ్మ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *