Breaking News

Tag Archives: tirumala

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త: నేటి గురువారం ఉదయం ప్రాతః కాల సమయంలో గౌ.రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని సేవించి దర్శించుకున్నారు.

Read More »

శ్రీవారి ఆశీస్సులతో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని ప్రార్థించా…

– శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం సుసంపన్న, శక్తివంతమైన దేశంగా అవతరించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్ధించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, “నా దేశ ప్రజలకు సేవ చేయడానికి నాకు మరింత శక్తినివ్వాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించిన్నట్లు …

Read More »

జులై 3న పౌర్ణమి గరుడ సేవ

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 3న గరుడసేవ జరుగనుంది. ఈ రోజు గురు పౌర్ణ‌మి కావ‌డం విశేషం.ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

Read More »

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ తిరుమల దేవస్థానం పరిసర ప్రాంతాల్లో రాత్రి మరియు ఉదయం సందర్శన చేయడం జరిగిందని, ఈ నేపధ్యంలో కొంత మంది బాలలు బిక్షాటన చేయడం, బొమ్మలు మరియు ఆట వస్తువులు అమ్ముతున్న పిల్లలు ను గమనించడం జరిగిందని తెలిపారు. తక్షణమే ఆలయ ముఖ్య అధికారులు, సిబ్బంది, విజిలెన్స్ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఉదయం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్. నేటి మంగళ వారం ఉదయం తిరుమల శ్రీవారిని గౌ. కేంద్ర మంత్రివర్యులు కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న జాతీయ మీడియా, అంతర్రాష్ట్రీయ వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్. నేటి మంగళవారం  తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందచేశారు. అనంతరం తిరుమల నుండి జాతీయ మీడియా సలహాదారు వారు రేణిగుంట విమానాశ్రయంకు బయల్దేరి తిరుగు పయణం అయ్యారు.

Read More »

తిరుమల శ్రీ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం నుండి కుటుంబ సమేతంగా బయలుదేరి శ్రీవారి ఆలయం చేరుకున్న ఆం.ప్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కి టీటీడీ ఈవో ఎ.వి ధర్మారెడ్డి స్వాగతం పలకగా ముందుగా గవర్నర్ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం చేరుకున్న వీరికి వేదపండితులు ఇస్తేకఫాల్ స్వాగతం పలకగా ముందుగా ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం వద్ద వేద పండితులు వేద …

Read More »

తిరుమల శ్రీ పద్మావతి అతిథిగృహం చేరుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల తిరుమల,తిరుపతి పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి7.52 గంటలకు తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి టిటిడి ఈ.ఓ ఏ.వి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్  వెంట ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తదితర అధికారులు ఉన్నారు. గవర్నర్ గారు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం నందు రాత్రి బస చేసి శనివారం ఉదయం తిరుమల …

Read More »

టీటీడీ బోర్డు ఎక్స్-అఫీషియో సభ్యుడిగా దేవాదాయ శాఖ కమిషనర్ ప్రమాణ స్వీకారం

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ జెఈవో వీరబ్రహ్మం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. సత్యనారాయణకు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను జెఈవో అందించారు. ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఆలయ పేష్కార్ శ్రీహరి …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని సోమవారం ప్రాతః కాల సమయంలో సతీ సమేతంగా శ్రీవారిని సేవించి దర్శించుకున్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ. శ్రీ వారి దర్శన అనంతరం తిరుమల నుండి వారు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి వీడ్కోలు పలికిన వారిలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ మరియు …

Read More »