వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ తిరుమల దేవస్థానం పరిసర ప్రాంతాల్లో రాత్రి మరియు ఉదయం సందర్శన చేయడం జరిగిందని, ఈ నేపధ్యంలో కొంత మంది బాలలు బిక్షాటన చేయడం, బొమ్మలు మరియు ఆట వస్తువులు అమ్ముతున్న పిల్లలు ను గమనించడం జరిగిందని తెలిపారు. తక్షణమే ఆలయ ముఖ్య అధికారులు, సిబ్బంది, విజిలెన్స్ అధికారులు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి వారిని పాటశాలలో చేర్పించే దిశగా విద్యా శాఖ అధికారులు అడుగులు వేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాపార సంస్థలు ప్రతినిధులు బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేసులు నమోదు చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *