Breaking News

తిరుమల శ్రీ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం నుండి కుటుంబ సమేతంగా బయలుదేరి శ్రీవారి ఆలయం చేరుకున్న ఆం.ప్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కి టీటీడీ ఈవో ఎ.వి ధర్మారెడ్డి స్వాగతం పలకగా ముందుగా గవర్నర్ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం చేరుకున్న వీరికి వేదపండితులు ఇస్తేకఫాల్ స్వాగతం పలకగా ముందుగా ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం వద్ద వేద పండితులు వేద మంత్రాలతో గవర్నర్ వారికి ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో గవర్నర్ కి వెంకటేశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని అందచేశారు. అనంతరం గవర్నర్  రేణిగుంట విమానాశ్రయం కు బయలుదేరి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట గవర్నర్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *