విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా ఆయన అనుచరులు, సన్నిహితులు సామాజిక సేవ కార్యక్రమలు చేపట్టి పేదవారికి అండగా నిలవడం ఆనందంగా ఉందని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని 14వ డివిజన్, అంబేద్కర్ నగర్ నందు మల్లి యూత్ ఆధ్వర్యంలో రాంబా నాగేశ్వరరావు కి 25000 రూపాయల విలువ చేసే బార్బర్ షాప్ ను, దేవినేని రాజశేఖర్ నెహ్రూ సేవా స్పూర్తితో అవినాష్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవినేని నెహ్రూ ఎప్పుడు కూడా పేదలకు అండగా ఉండేవారని,కష్టం అంటూ ఎవరు ఇంటికి వచ్చిన కులమత పార్టీలకతీతంగా వారికి అండగా నిలిచి, సమస్య పరిష్కారానికి కృషి చేశారని,నేడు ఆయన తనయుడు గా నేను కూడా అదేబాటలో నడుస్తూ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య,వైద్య,ఉపాధి కల్పన కోసం అనేక సేవ కార్యక్రమలు చేపట్టడం జరిగిందని వివరించారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని, బార్బర్ షాప్స్ కి 150 యూనిట్స్ వరకు కరంట్ ఉచితంగా ఇస్తున్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా వైస్సార్సీపీ పార్టీ బలోపేతం చేయడంతో పాటు,విస్తృతంగా సేవ కార్యక్రమలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చలపాటి వెంకటేశ్వరరావు, చింతల సాంబయ్య,శెటికం దుర్గాప్రసాద్,సుబ్బరాజు, గల్లా రవి, ఉకోటి రమేష్,నాగ మల్లి, కన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విద్యాసాగర్ పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి తరలిరండి…
– ఏపీఎన్జీజీవో నగర శాఖ అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ పిలుపు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపి ఎన్జీజీఒ …