విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం స్థానిక 2వ డివిజిన్లో టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అవినాష్ మరియు స్థానిక కార్పొరేటర్ నిర్మలాకుమారి దాదాపు 2000 మంది స్థానికులకు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని నెహ్రూ హయాం నుండి కూడా కోటేశ్వరరావు రాజకీయంగా మాతో ప్రయాణిస్తూ ఎన్నో సామాజిక సేవ కార్యక్రమలు చేపడుతున్నారని, గత కరోనా సమయంలో కూడా టైలర్లు అందరికి ఆనందయ్య మందు పంపిణీ చేశారని, మరలా నేడు కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానిక ప్రజానీకానికి ఈ మందును అందజేయడం అభినందనీయం అని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని సేవ కార్యక్రమలు చేపట్టాలని మా సంపూర్ణ సహాయసహకారాలు వుంటాయని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామయ్య, కుటుంబరావు, మొయిన్, శివ, కరీముల్లా, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద దివ్యంగులకు చేయూత నివ్వడం అభినందనీయం అని జిల్లా …