Breaking News

రబీ 2025–26 సీజన్‌పై నీటిపారుదల సలహా మండలి సమీక్ష

– ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని అధికారులతో తదుపరి సమావేశం నిర్వహించాలి
– ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇతర ప్రజా ప్రతినిధులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ 2025-26 పంట సాగు నేపథ్యంలో గోదావరి డెల్టా సిస్టం పరిధిలో నీటి లభ్యత, ఆయకట్టు, సాగు ప్రణాళికలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తూర్పు గోదావరి జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం బుధవారం రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అధ్యక్షతన నిర్వహించబడింది. గోదావరి డెల్టా సిస్టం మొత్తం 8,96,507 ఎకరాలకు అవసరమయ్యే 93.26 టి.యమ్.సిల నీటి లభ్యత, సీలేరు, పోలవరం నిల్వలు, అలాగే డిసెంబర్–మార్చి కాలంలో అంచనా ఇన్ ఫ్లోస్ నేపథ్యాలను ఆమె సమీక్షించారు. నీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణ, ముఖ్యంగా పశ్చిమ–తూర్పు డెల్టాలో చేపట్టవలసిన మరమ్మతులపై సమగ్ర దృష్టి పెట్టాలని సూచించారు. ఏజెన్సీలు కాకుండా ఇరిగేషన్ అధికారులు స్వయంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేయాలని, ఇది రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుస్తుందని ఎంపీ పురంధరేశ్వరి పేర్కొన్నారు. ఎంపీ పురంధరేశ్వరి తెలిపారు कि ఓ అండ్ ఎం, ఆర్.ఆర్.ఆర్ మరియు ఆధునీకరణ పనులన్నీ అంతర్జిల్లా సమన్వయంతో జరగాల్సిన అవసరం ఉందని. ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు కలిసి సమీక్షలు నిర్వహించినప్పుడే గోదావరి డెల్టా యొక్క సంక్లిష్ట నీటి పారుదల వ్యవస్థ స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. రైతులకు మేలు కలిగించే కీలక నిర్ణయాలు అమలులో పారదర్శకత, వేగం మరియు సమన్వయం తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రబీ 2025–26 పంట సాగు సమయానికి అవసరమైన నీటి పంపిణీ, కాలువల సంరక్షణ మరియు ఇంజినీరింగ్ పనులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను శనివారానికి సమర్పించాలని శాఖాధికారులకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్ సిబ్బందిని సమన్వయం చేసి 60 రోజుల్లో సమగ్ర DPR సిద్ధం చేయాలని సూచించారు. షట్టర్ మరమ్మతులు, బండ్ల పటిష్టత, కాటన్ మ్యూజియం నిర్వహణ వంటి అంశాల్లో దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇరిగేషన్ సూపరింటెండింగ్ ఇంజనీ
కే. గోపినాథ్ వివరాలు తెలియ చేస్తూ, గోదావరి డెల్టా సిస్టంను సంబంధించిన ఆయకట్టు, నీటి అవసరత, TMC లభ్యత, సీలేరు–పోలవరం లింక్‌ల వివరాలతో కూడిన అజెండా అంశాలునీ సమగ్రంగా వివరించారు. తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా, తొర్రిగెడ్డ పంప్ సిస్టం, కొవ్వాడ కాలువల కోసం 73,236 ఎకరాలకు 7.324 TMC నీరు అవసరమని తెలిపారు. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్, కాలువలు, డ్రైన్లలో జరుగుతున్న ఓ & ఎం పనులు, స్టేట్ డిజాస్టర్ నిర్వహణ నిధుల పనులు పురోగతిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మంజూరైన నిధులు, టెండర్ పురోగతి వంటి అంశాలు సమావేశానికి సమర్పించారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ఓ & ఎం నిధులతో చేపడుతున్న షట్టర్ మరమ్మతులు పూర్తి స్థాయిలో మరియు నాణ్యతతో చేయాలని సూచించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, బురద కాలువ సమస్యల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. తొర్రిగెడ్డ, చాగల్నాడ్, పుష్కర్ ప్రాజెక్టులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కమర్షియల్ క్రాప్ ఏరియాలలో బండ్ల పటిష్టతను అత్యవసర ప్రాధాన్యంతో తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గోదావరి ఘాట్ల , ధవళేశ్వరం బ్యారేజ్‌లోని 175 గేట్లలో 115 అనివార్యంగా మరమ్మతులు కావాల్సి ఉందని పేర్కొన్నారు. గత పాలకులు ఈ సూచనను నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఈ కీలక అంశాన్ని ప్రాధాన్యంతో తీసుకుంటుండటం ప్రశంసనీయం అని తెలిపారు. ఈ విషయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి చేసిన సూచనకు సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు.

 

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బల రామకృష్ణ , నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, ఈస్టర్న్ డెల్టా చైర్మన్ మూరలశెట్టి సునీల్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, ఇరిగేషన్ ఎస్ ఈ కే గోపినాథ్, ఆర్డీవోలు ఆర్. కృష్ణ నాయక్, రాణి సుస్మిత, మరియు పలువురు ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్, రెవెన్యూ , సలహా మండలి సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగరంలో శ్రీవిద్య లగ్జరీ షోరూమ్ ప్రారంభం

విజయవాడ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *