విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వేలమూరి శేషాచలపతి శర్మ ఆధ్వర్యంలో పైపుల రోడ్డు కనకదుర్గమ్మ వారి ఆలయం సమీప కరకట్ట వద్ద 108 మందార మొక్కలను నాటే కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ రెడ్డి తో కలిసి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమాల స్పూర్తితో వేలమూరి శేషాచలపతి శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం అభినందనీయమని మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఒక్క పిలుపుతో ప్రజలు ముందుకొచ్చి వందలాది మొక్కలను నాటడం అభినందనీయమన్నారు. మొక్కలను నాటి వదిలేయడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. చెట్ల పెంపకంతో కాలుష్యం తగ్గుతుందని, ప్రకృతి వైపరీత్యాలను సైతం నివారించవచ్చని వెల్లడించారు. తద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల రహదారులు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్ధలు సైతం పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి, నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, అలంపూర్ విజయ్, మోదుగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అందించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు రూ.5కే ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన …