శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీశైలంలో శుక్రవారం నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వామివారి గర్భాలయ అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు. రోజూ 4 విడతల్లో ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహిస్తారు. మల్లికార్జునస్వామి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఈ మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులిస్తారు. భక్తులు కార్తీక దీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయ దక్షిణ మాడవీధిలో, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం ప్రారంభ సూచికగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ మాసమంతా ఆలయంలో దీపాన్ని వెలిగిస్తారు.
Tags srisilam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …