అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటకరంగంలో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏప్రిల్ 16వతేదీన విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సును నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావు (అవంతి) తెలిపారు. విశాఖపట్నంలోని హూడా చిల్డ్రన్స్ పార్క్ లో సదస్సు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ సదస్సు దోహదపడుతుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో పర్యాటక రంగం ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గోన్నారు. ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పెట్టుబడులను సమీకరించి పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ అభిమతమని మంత్రి తెలియజేశారు. ఈ సదస్సులకు వివిధ రంగాల్లో నిష్ణాతులైనవారిని ఆహ్వానించడంతోపాటు పెట్టుబడుదారులు అధికసంఖ్యలో సదస్సు లో పాల్గోనే విధంగా చూడాలని అవంతి శ్రీనివాసరావు పర్యాటకశాఖాధికారులకు సూచించారు. రాష్ట్రంలో పర్యాటకరంగాన్ని అభివృద్ది చేయాలనే తపనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని అందుకే ఈ రంగానికి ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని అవంతి తెలిపారు పర్యాటకశాఖ రూపొందించిన పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు. పర్యాటక శాఖలో ఇన్వెష్టర్ల కోసం ప్రత్యేక సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశిం చారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయగల ప్రాంతాలను గుర్తించేందుకు నివేదికను రూపొందించాలని ఆయన కోరారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగం అభివృద్దికి సంబందించి నివేదికను తయారుచేయాలని ఆయన సూచించారు. ఏకో టూరిజం, ఆర్గానిక్ టూరిజం పర్యాటక పాలసీపైనకూడా మంత్రి చర్చించారు. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేవిషయంలో మంత్రి అవంతి ఇన్వెష్టర్ల సలహాలు సూచనలను అడిగి తెలుసుకున్నారు. దుబాయ్ లో ఉంటున్న ప్రవాసభారతీయుడు పారిశ్రామికవేత్త రాఘవశ్రీనివాస మూర్తితో మంత్రి అవంతి శ్రీనివాస్ దృశ్య మాధ్యమం ద్వారా సంప్రదించారు. ఆంధ్రప్రదేపర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయనను మంత్రి కోరారు. పర్యాటకాభివృధ్ధి సంస్ధ ఛైర్మన్ ప్రసాదరెడ్డి పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పర్యాటకాభివృద్ధి సంస్ధ ఎం.డి. సత్యనారాయణ, ఎపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ,ఎపి ఎన్ ఆర్ టి, ప్యాప్సీ, ఆనంద్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ డెవలపర్స్ ,షోరివ్యూ హాస్పటాలిటీ, విజింట్ ఎంటర్ ప్రైజస్ కు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
Tags vijayawada
Check Also
సోమవారం డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 30వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల …