శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 పోస్టర్‌ను ఆవిష్కరించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే..

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త:
హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం–2026 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొని సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. నవంబర్ 4వ తేదీ నుంచి శ్రీకృష్ణ సదర్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. యాదవుల ఐక్యత, సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ యాదవ సంఘాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల నాయకులు, సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.