-ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా సంస్కృతిని -గద్దె క్రాంతి కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదల కోసం పని చేయడం మా బాధ్యతని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా సంస్కృతిని కూటమి ప్రభుత్వం మాటల్లో కాదు, పనిలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంత వాసుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇప్పుడు న్యాయం జరుగుతోంది …
Read More »Tag Archives: vijaya
13 ఔట్సోర్సింగ్ కోచ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో 13 ఔట్సోర్సింగ్ కోచ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు ఈ రోజు విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా ప్రతిభను మరింత అభివృద్ధి పరిచేందుకు శాప్ నిరంతరం కృషి చేస్తోందని, కొత్తగా నియమించబడిన కోచ్లు యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే దశగా ఉత్తమ సేవలు అందించాలన్నారు. ఆర్చరీ, బాడ్మింటన్, …
Read More »నగరంలో ఫ్రంట్ రాష్ట్ర భాగస్వామ్య సంస్థల ప్రతినిధుల సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మూడవ రాజకీయ ప్రత్యామ్నాయంగా జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి (NDSF) నిలుస్తుందని ఫ్రంట్ చైర్మన్ వడ్లమూరి. కృష్ణ స్వరూప్ ప్రకటించారు. నేడు విజయవాడ లోని అజిత్ సింగ్ నగర్ అంబేద్కర్ హల్లో జరిగిన ఫ్రంట్ రాష్ట్ర భాగస్వామ్య సంస్థల ప్రతినిధుల సమావేశం దళిత బహుజన పార్టీ (DBP) ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ ఎస్.ఆంజనేయకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుల పైన దాడులు జరుగితున్నా.. NDA సర్కార్ స్పందించటలేదన్నారు. శాంతి …
Read More »నిలకడగా డయేరియా బాధితుల ఆరోగ్యం
-జీజీహెచ్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నాం -ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు -తాగునీరు, ఆహార నమూనాలను పరీక్షలకు పంపించాం -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన డయేరియా బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని.. జీజీహెచ్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని న్యూ జీజీహెచ్ ను బుధవారం రాత్రి సందర్శించారు. బాధితులకు అందిస్తున్న …
Read More »గణేష్ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న డాక్టర్ తరుణ్ కాకాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ విసర్జనా సందర్భంగా, బిజెపి డైనమిక్ లీడర్ డాక్టర్ తరుణ్ కాకాని గణేష్ యొక్క ప్రతిష్టాత్మకమైన మరియు పవిత్రమైన లడ్డూ ప్రసాదం వేలంలో పాల్గొని 1,01,116/- రికార్డు ధరతో దానిని గెలుచుకున్నారు. ఇది బిజెపి ప్రధాన కార్యాలయంలోని గణేష్ లడ్డూ ప్రసాదం కోసం వచ్చిన వేలం మొత్తం యొక్క మునుపటి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. హేమా హీమీ నాయకులు ఈ వేలంలో భౌతికంగా …
Read More »పల్లె ప్రగతితోనే వికసిత్ భారత్..
– స్వర్ణాంధ్ర సాకారానికి సమష్టిగా కృషిచేద్దాం – పీఏఐ 2.0తో పంచాయతీల అభివృద్ధిపై నిరంతర పర్యవేక్షణ – కొత్త సూచీలో తొమ్మిది ఇతివృత్తాలు, 147 సూచికలు – పంచాయతీల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించేందుకూ మార్గం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. గ్రామాల సుస్థిర అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని బలంగా నమ్మిన మహాత్ముని ఆశయాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నాయని, …
Read More »అమరావతి సభ విజయవంతమైనందుకు ప్రజలు సంతోషించారు
-గత పాలకులు అమరావతిని భ్రమరావతి అని ఎద్దేవ చేశారు -ప్రధాన మంత్రే స్వయంగా ముఖ్యమంత్రి పనితనానికి కితాబిచ్చారు -రాబోయే కాలంలో ఏఐ, ఐటీ, క్యాంటం కంప్యూంటింగ్ లకు కేరాఫ్ గా అమరావతి -ప్రపంచంలో అమరావతి నెంబర్ వన్ సిటీగా అవతరించనుంది విజయవాడ నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి పునః ప్రారంభ సభ చాలా గొప్పగా విజయవంతం అయ్యిందని అందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషించారని సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ ల మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. బందరు రోడ్డులో గల …
Read More »రాష్ట్ర ప్రజలపై నియోజకవర్గ ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి… : MLA బొండా ఉమ
-మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చల్లపల్లి బంగ్లా దగ్గర ఉన్న శివాలయంలో నందు బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సకుటుంబ సమేతంగా పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని రాష్ట్ర ప్రజలపై పరమేశ్వరుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ… ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని …
Read More »ఇంజనీరంగ్ తొలి విడతలో 1,17,136 సీట్లు భర్తీ
-సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య -జులై 19 నుండి ప్రారంభం కానున్న తరగతులు -మలివిడత కోసం మిగిలి ఉన్న సీట్లు 19,524 -తదుపరి దశలో క్రీడా, ఎన్ సిసి కోటా సీట్ల భర్తీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా బుధవారం తొలివిడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ బి నవ్య తెలిపారు. విధ్యార్ధులు జులై 22వ తేదీ లోపు …
Read More »మరింత బలోపేతంగా “ఈ-ఆఫీస్” వ్యవస్థ
-ప్రభుత్వ ప్రక్రియలు, సేవా పంపిణీలో పారదర్శకత, సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ-ఆఫీస్ అప్లికేషన్ అప్ గ్రెడేషన్ -తాజా వెర్షన్ 7.x కి ఈ-ఆఫీస్ ను అప్ గ్రెడేషన్ చేస్తోన్న ఢిల్లీలోని ఎన్ఐసీ, భారత ప్రభుత్వం -అప్ గ్రెడేషన్ ప్రక్రియను ప్రత్యేకంగా చేస్తున్న ఢిల్లీ ఎన్ఐసీ బృందం.. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు అప్ గ్రెడేషన్ కు షెడ్యూల్ ప్రకటన -రాష్ట్రంలో ఈ నెల 17 నుండి 25 వరకు అప్ గ్రెడేషన్ ప్రక్రియకు షెడ్యూల్ ఖరారు.. అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. -ఇదే తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు …
Read More »
Prajavartha Online Telugu News