Breaking News

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పరిశీలన…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మంగళవారం స్థానిక లేడీ యాoప్తిల్ జూనియర్ కళాశాల సందర్శించి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక లేడీ యామ్థిల్ కళాశాలలో పరీక్షల నిర్వహణ పరిశీలించినట్లు తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 21532 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు నిర్దేశించిన నియమావళి అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు మొబైల్ టీములు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షిస్తున్నయన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో కూడా విద్యార్థులకు గదులలో అవసరమైన వెలుతురు, విద్యుత్తు, ఫ్యాన్లు త్రాగునీటి సౌకర్యం కల్పించారని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు., మిగతా పరీక్షలు కూడా ప్రశాంతంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఇంటర్ రెండవ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష జరుగుతున్నట్లు ఆర్ ఐ ఓ పి. రవికుమార్ కలెక్టరుకు తెలిపారు. డిస్ట్రిక్ట్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పి.బి సాల్మన్ రాజు, డిస్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కమిటీ మెంబర్ ప్రసాద్ శాస్త్రి, ప్రిన్సిపాల్ కళ్యాణి కలెక్టర్ వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *