రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూన్నామని రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. సోమవారం రాత్రి స్ధానిక ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ లో పోస్టల్ బ్యాలెట్ ఫేసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు పనులని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫెసిలిటేషన్ కేంద్రానికి వొచ్చి ఓటు హక్కును వినియోగించు కోవాలని పేర్కొన్నారు. పీవో, ఒపివో, ఇతర అత్యవసర సేవలు అందించే అధికారులు తదితరులు ఓటింగ్ చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లూ చేయాలనీ ఆదేశించారు. ఈ సందర్శనలో జేసి వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఐ సాయి బాబా, సహయ రిటర్నింగ్ అధికారులు వైవీ కే అప్పారావు, బీ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వివిధ రంగాలకు చెందిన 18 మంది సభ్యులతో రాష్ట్ర సలహా కమిటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) వివిధ రంగాలకు చెందిన 18 మంది …