-రాజమండ్రి పార్లమెంట్ కు 4 నామినేషన్లు
-7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20 నామినేషన్లు దాఖలు
-జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని సోమవారం నాలుగు పార్లమెంటు, ఏడు అసెంబ్లి నియోజకవర్గాల్లో 20 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు దాఖలు చెయ్యడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.
ఇందులో భాగంగా 08- రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైస్సార్ సీపీ తరపున గూడూరి శ్రీనివాసులు, ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ తరపున గిడుగు రుద్రరాజు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రేస్ (సెక్యులర్)పార్టీ తరపున మేడా శ్రీనివాసరావులు, స్వతంత్ర అభ్యర్థిగా బత్తుల బలరామ కృష్ణలు తమ నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి డాక్టర్ కే మాధవీలత కు అందజేశారు.
నియోజకవర్గాల వారీగా ఏప్రిల్ 22 వ తేదీ నామినేషన్ల వివరాలు
040- అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అఖిల భారతీయ జన సంఘం పార్టీ తరపున కావూరు శివానందరెడ్డి, బీజేపి పార్టీ తరపున ములగపాటి శివరామ కృష్ణంరాజు తరపున అతని భార్య దుర్గా దేవిక నామినేషన్ దాఖలు చేశారు.
049- రాజానగరం నియోజక వర్గంలో జనసేన పార్టీ తరపున బత్తుల బలరామ కృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి , స్వతంత్ర అభ్యర్థిగా కట్టా కృష్ణ నామినేషన్ దాఖలు చేశారు.
050- రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ కాంగ్రేస్ పార్టి తరపున బోడా లక్ష్మీ వెంకట ప్రసన్న, తెలుగుదేశం తరపున ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, వైఎస్సార్ సీపీ తరపున మార్గాని భరత్ రామ్, మార్గాని నాగేశ్వరరావు లు నామినేషన్ దాఖలు చేశారు.
051- రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో జైభారత్ పార్టీ తరపున మన్నం రఘరామ్, స్వతంత్ర అభ్యర్థిగా చింతలపల్లి పవన్ కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున బెల్లంపల్లి మురళీధర్, తెలుగుదేశం పార్టీ తరపున గోరంట్ల ఝాన్సీలక్ష్మి, గోరంట్ల బుచ్చియ్య చౌదరి నామినేషన్ దాఖలు చేశారు.
054- కొవ్వూరు (ఎస్సీ ) నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ముప్పిడి వెంకటేశ్వరరావు, ముప్పిడి సుజాత, స్వతంత్ర అభ్యర్థులు గా తాతపూడి సుజయ్ ప్రవీణ్ కుమార్, మొల్లా కమల అలియాస్ ఆరుగోలను కమల తమ నానినేషన్ దాఖలు చేసారు.
055- నిడదవోలు నియోజక వర్గంలో జనసేన పార్టీ తరపున కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్,
066- గోపాలపురం నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కట్టా శ్రీ లక్ష్మీ తమ నామినేషన్లును దాఖలు చేసారు.
జిల్లాలో ఏప్రిల్ 18 నుండి 22 వరకు నామినేషన్ల దాఖలు వివరాలు.
08- రాజమండ్రి పార్లమెంట్ కు .. 05 నామినేషన్లు
40- అనపర్తి నియోజక వర్గం .. 04 నామినేషన్లు,
49- అనపర్తి నియోజక వర్గం .. 06 నామినేషన్లు
50- రాజమండ్రి సిటీ నియోజకవర్గం.. 07
51- రాజమండ్రి రూరల్ నియోజకవర్గం.. 08
54- కొవ్వూరు నియోజకవర్గం.. 11
55- నిడదవోలు నియోజకవర్గం.. 08
66 – గోపాలపురంనియోజకవర్గం.. 04
మొత్తం ఇప్పటి వరకు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 5 నామినేషన్లు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 48 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
Prajavartha Online Telugu News