-ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు ఫెసిలిటేషన్ సౌకర్యం: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ కొరకు రేపు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు సదరు దరఖాస్తులను పక్కాగా తయారీతో సమర్పించాలని సదరు పోస్టల్ బ్యాలెట్ లను భద్రత నడుమ జిల్లాకు తీసుకు రావాల్సి ఉంటుందని సంబంధిత అధికారులకు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు.
శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు… పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కొరకు అందిన దరఖాస్తు పత్రాల పరిశీలనను తనిఖీ చేసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి తిరుపతి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారికి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సమర్పించిన పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులను జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా విభజించి రేపు సిఈఓ, వెలగపూడి కార్యాలయం నందు సమర్పించాల్సి ఉంటుందని, సదరు ఉద్యోగుల బ్యాలెట్ ను భద్రత నడుమ తిరుపతి జిల్లాకు తీసుకురావాల్సి ఉంటుందని సంబంధిత అధికారులకు సూచించారు.
సదరు ఇతర జిల్లాలో ఓటు కలిగి తిరుపతి జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును మే నెల 5 మరియు 6 తేదీలలో ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ స్కూల్, బాలాజీ కాలనీ నందు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ నందు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారిణి సుశీల దేవి,సిబ్బంది పాల్గొన్నారు.