కలంకారీ పరిశ్రమ అభివృద్ధికి కృషి…

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి విజయవాడ వారు HCL foundation వారి సహకారంతో కలంకారీ క్లస్టర్ డెవలప్మెంట్ లో భాగంగా కళాకారులకు స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంటర్ ప్రీన్యూవర్షిప్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలు గత పది నెలలుగా చేస్తూ ఉన్నారు. ఈమధ్య కాలంలో కలంకారి పనిలో ముఖ్య ఘట్టమైన నీళ్లతీతలు విషయంలో ఇబ్బందులు బాగా ఎదుర్కొంటున్నారు. వేసవికాలంలో పెడన పరిసర ప్రాంతాలలో కాలువలలో నీరు లేకపోవడం, నీటి ఎద్దడి కారణంగా నీళ్ల తీతల కొరకు యనమలకుదురు పెద్దపులిపాక శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వెళ్తారు, అక్కడి స్థానికుల నుండి అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత 15 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే కలంకారి ప్రింటింగ్ కొనసాగుతూ వస్తుంది. ఈ విషయంపై కలంకారి పరిశ్రమ పెద్దలు మరియు కార్మికులు వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ బొల్లినేని కీర్తి కి విన్నవించటం జరిగింది. వాసవ్య మహిళా మండలి వారు క్లస్టర్ లోని కలంకారి తయారీదారులను మరియు కళాకారులను అందరినీ సంప్రదించి అందరి చేత ఆమోదించబడిన రిప్రెసెంటేషన్ని అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు అందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. కలంకారి పరిశ్రమకు అండగా ఉండాలని పెడన నియోజకవర్గ వర్గం లో ప్రచారం నిర్వహిస్తున్న కాగిత కృష్ణ ప్రసాద్ కి వాసవ్య మహిళా మండలి HCL ఫౌండేషన్ కలంకారి క్లస్టర్ కోఆర్డినేటర్, మరియు కలంకారి మాస్టర్ క్రాఫ్ట్ మెన్ లు మరియు కలంకారి కళాకారులు సమస్యను క్షుణ్ణంగా వివరించి కలంకారీ పరిశ్రమ అభివృద్ధికి తమ సహకారం అందించి పరిశ్రమ మీద ఆధారపడి ప్రత్యక్షంగానూ మరియు పరోక్షంగానూ జీవిస్తున్న వేల మందికి జీవన ఉపాధి అభివృద్ధికి సహకారం అందించమని కోరారు. ఈ కార్యక్రమానికి ఆకులమన్నాడు కప్పలదొడ్డి పెడన గ్రామ పెద్దలు మరియు కలంకారి కళాకారులు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *