తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద నేడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించారు. కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.
Tags tenali
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …