-చివరి తేది ఆగస్టు 9 సా.5.00 వరకూ
-డి పి జే గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ సవరించిన పథకం, 2022 ప్రకారం స్థాపించబడిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయం, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం నందు రెండు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలు , ఐదు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాల ను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డి ఎల్ ఎస్ ఎ ఛైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళ వారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.
సంబంధిత దరఖాస్తు పత్రాలు తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్ సైట్ నందు కానీ తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నోటిస్ బోర్డు నందు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కు క్రిమినల్ లా నందు 7 సంవత్సరాలు అనుభవం, సెషన్స్ కోర్ట్ లో కనీసం 20 క్రిమినల్ ట్రైల్స్ చేయడం తో పాటు మంచి సంభాషణా, లేఖన నైపుణ్యాలు ఉన్న న్యాయవాదులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కు క్రిమినల్ లా నందు 0 నుండి 3 సంవత్సరాల అనుభవంతో పాటు మంచి సంభాషణా, లేఖన నైపుణ్యాలు ఉన్న న్యాయవాదులు ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 5 గం.ల లోగా వారి దరఖాస్తులను తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయము నందు సమర్పించవలేనని తెలిపారు. మరింత సమాచారం కోసం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన అధికారిక వెబ్ సైట్ https://eastgodavari.dcourts.gov.in/
ను సందర్శించాలని పేర్కొన్నారు.