-వైఎస్సార్ ఫోటోను అందించిన సీతక్క.. మధుర జ్ఞాపికగా అభివర్ణించిన షర్మిల
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త:
తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్కను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క నివాసంలో ఆమెకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వైఎస్ షర్మిలకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను అందించారు. ఈ ఫోటో తనకు ఎంతో ప్రత్యేకమని, ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపికగా నిలిచిపోతుందని వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు.
