ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీపై ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఐటీ పాలసీ, డ్రోన్ పాలసీపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వీటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈనెల 22, 23వ తేదీల్లో తలపెట్టిన అమరావతి డ్రోన్ సమ్మిట్ పై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ భాగస్వామ్యంతో ఎపి డ్రోన్ కార్పొరేషన్ ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్ కు 400 మంది డెలిగేట్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు హాజరవ్వనున్నారు. విద్యార్థులు, ప్రోఫెషనల్స్, టెక్నాలజీ నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. డ్రోన్ తయారీ దారులు, వినియోగదారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 5 వేల డ్రోన్లతో ఈ సమ్మట్ లో ప్రత్యేకంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. 9 రకాల థీమ్స్ ఈ సమ్మిట్ లో భాగస్వామ్యం చేయనున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, డిజాస్టర్ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, పబ్లిక్ సేఫ్టీ అండ్ లా ఎన్ ఫోర్స్ మెంట్, హెల్త్ కేర్ అండ్ మెడికల్ డెలివరీ, నాచులరల్ రిసోర్స్ మేనేజ్మెంట్, సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ ఫర్ ఇంప్రూవ్డ్ గవర్నెన్స్, ట్రాన్స్ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఎఫిషియన్సీ, డ్రోన్ అసిస్టెడ్ కంప్యూటర్ విజన్ వంటి అంశాలను సమ్మట్ లో ప్రదర్శించనున్నారు. డ్రోన్ సమ్మిట్ సందర్భంగా పత్యేక హ్యాకథాన్ నిర్వహించనున్నారు. దీనికి ఇప్పటికే ఆన్ లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు 22వ తేదీన ఈ సమ్మిట్ కు హాజరుకానున్నారు.

Check Also

మత్స్యకారులకు అన్ని విధాల చేయూతను అందిస్తాం

-మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం -అధికారంలోకి రాగానే 217 జీవోను రద్దు చేశాం -గత ప్రభుత్వ బకాయిలు మూడున్నర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *