-ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తదుపరి జరగుతున్న తొలి ఎన్నికలలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ అభ్యర్దిత్వాన్ని బలపరచాలని ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు విన్నవించారు. గుంటూరు జిల్లా టి డి పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మోటూరి శంకరరావు మాట్లాడుతూ 15 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రతి మాజీ సైనికులు కూడా, శాసనమండలి ఎన్నికలకు ఓటు వేయడానికి అర్హుడు కావున, ప్రతి ఒక్క మాజీ సైనికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జీవో నెంబర్ 57– 2001 ప్రకారం మాజీ సైనికులు అందరూ తమ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ప్రకారం ఓటు హక్కును వినియోగించుకుని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆలపాటి రాజా ని గెలిపించుకోవడం ద్వారా మన మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించుకునే వీలుంటుంది కావున మన సమస్యలు పరిష్కరించే మనిషిని మనం గెలిపించుకోవాలి అన్నారు. ఈ సమావేశంలో తెనాలికి చెందిన మిలట్రీ ప్రసాద్, అన్నే రామారావు, ఆంజనేయులు, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ ఎమ్ చిన కొండలరావు తదితరులు పాల్గొన్నారు.