గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా ఇంటింటి స్కిల్ సర్వే పక్కాగా చేసి, ఆన్ లైన్ యాప్ లో నమోదు చేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు తెలిపారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో యువత నైపుణ్యం పై చేపట్టనున్న సర్వే పై వార్డ్ సచివాలయ కార్యదర్శులకు సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యువత నైపుణ్య గుర్తింపు కోసం ఇంటింటి సర్వేని వార్డ్ సచివాలయ కార్యదర్శులు చేపట్టాలన్నారు. సర్వేలో ప్రతి ఒక్కరీ చదవు, ఉద్యోగం, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, గతంలో చేసిన ఉద్యోగ సమాచారం తదితర వివరాలు సమగ్రంగా సేకరించి, వివరాల నమోదుకి కేటాయించిన యాప్ లో అప్ లోడ్ చేయాలన్నారు. సర్వే విధుల నుండి ఏ ఒక్కరికీ మినహాయింపు లేదని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యువత నైపుణ్య గుర్తింపు కోసం ప్రత్యేకంగా క్యాంపెయిన్ ప్రకటించిందని తెలిపారు. అనంతరం సర్వే పై స్టేట్ ట్రైనింగ్ కో ఆర్డినేటర్ గోపి కృష్ణ క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన సర్వే, యాప్ లో అప్ లోడ్ చేయాల్సిన విధానంపై కార్యదర్శులకు అవగాహన కల్గించారు. కార్యకమంలో జిఎంసి డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, ఉపా సెల్ పిఓ రామారావు, జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, స్కిల్ డెవెలప్మెంట్ అధికారి సంజీవరావు, జిఎంసి కో ఆర్డినేటర్ మనుదీప్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
విఎంసి సిబ్బందికు సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం …