గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, ఫంక్షన్ హాల్స్ ఉన్న హోటల్స్ యజమానులతో వ్యర్ధాల నిర్వహణపై మంగళవారం ఉదయం 10:30 గంటలకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని, ఆయా హాల్స్ యజమానులు సమావేశానికి హాజరు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో బల్క్ గా వ్యర్ధాలు ఉత్పత్తి జరిగే కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్ నిర్వాహకులకు వ్యర్ధాల నిర్వహణ, తడి పొడి విభజన అంశాలపై అవగాహన కల్గించేందుకు నగరపాలక సంస్థ తరుపున మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. శానిటరీ, రెవెన్యూ డివిజన్ల వారీగా ఆయా సిబ్బంది తమ పరిధిలోని హాల్స్ నిర్వహకులకు సమావేశంకు హాజరు కావాలని సమాచారం ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …