Breaking News

శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో వేడుకగా జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలు

-లక్ష్యం ఉంటే తప్పక విజయం సాధ్యం
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
-అంగన్వాడీ కేంద్రాల ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉంది.
-కలక్టర్ పి. ప్రశాంతి
-ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రథాన న్యాయమూర్తి, జిల్లా కలెక్టర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కలలను సాకారం చేసుకోవాలని జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపు నిచ్చారు. గురువారం ఉదయం స్ధానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల దినోత్సవం వేడుకలలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత , జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి , జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ప్రకాష్ బాబు లు ముఖ్యఅతిథులుగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు బాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, నేనూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసి నేడు ఉన్నతమైన స్థానానికి చేరుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ స్కూల్స్ పై చదివితే మంచి అవకాశాలు రావనే అపోహలను తొలగించే క్రమంలో ప్రభుత్వ పాఠశాల లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సమాజానికి ఒక సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వారు అనుకున్న లక్ష్య సాధనలో వాటిని సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపు నిచ్చారు.  తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే విధానంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం ఆధారపడి ఉండదని,  లక్ష్య సాధన ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యం అవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. పిల్లలు కోసం తల్లితండ్రులు ఎంతో కష్టాలను ఓర్చి స్కూల్ కి పంపడం జరుగుతుందని, ఉపాధ్యాయుల, తల్లి తండ్రుల పేరు నిలిపేలా ఇష్టంతో కూడి కష్టపడి విద్యను అభ్యసించారు. విద్య తో పాటు క్రీడలు కూడా తగిన మేర ప్రాధాన్యతా ఇవ్వాలని పేర్కొన్నారు. మనం నిర్వర్తించే విధుల పట్ల క్రమశిక్షణ, నిబద్దత కలిగి ఉండాలన్నారు. మరొకసారి మీతో సమయం గడపడం కోసం రావడం జరుగుతుందని, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి భవిష్యత్తు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారన్నారు. విద్యార్థులు విద్య పట్ల దృష్టి కేంద్రీకరించడం, శ్రద్ధ శక్తులు కలిగి ఉండడం వల్ల అట్టి విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆమె అన్నారు. ఉదాహరణకు జాన్ చాంద్ హాకీ క్రీడల్లో, సచిన్ టెండుల్కర్ బ్యాట్మెంటన్ గా తమ జీవితంలో నిరంతర సాధన చేయటం వలన వారు ఎంచుకున్న క్రీడలలో నైపుణ్యం సాధించగలిగి ప్రపంచ క్రీడాకారులుగా గుర్తింపు పొందారని ఆమె గుర్తు చేశారు. బాలలు ఎప్పుడు క్రమశిక్షణ కలిగి మంచి విషయకు దగ్గరగాను, చెడు విషయాలకు దూరంగాను ఉండే విధంగా అలవాట్లని అలవర్చుకోవాలని ఆమె హితవు పలికారు. విద్యార్థులు ఎల్లవేళలా మంచి విషయాలను మాత్రమే అలవర్చుకోవాలని ఆమె అన్నారు. మన జీవితంలో చదువుకున్న చదువులలో ముఖ్యంగా 10వ తరగతి దశలో వచ్చిన మార్కుల ప్రాధాన్యతనే ఆ విద్యార్థి యొక్క ప్రతిభా పాటవాలు అంచనా వేయవచ్చని ఆమె అన్నారు. గడిచిపోయిన కాలం ఎన్నటికీ తిరిగిరాదని, వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులు కాలాన్ని వృధా చేయకూడదని, గడిచిన కాలం తిరిగి రాదని, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపు ఇవ్వడం జరిగింది. విద్యార్థి దశ నుంచే లక్ష్యాలను మనం నిర్దేశించుకుని వాటిని అధిగమిస్తే ఆయా రంగాల్లో విజయం సాధించగలుగుతామని ఆమె అన్నారు. పిల్లల నడవడిక, మంచి చెడుల గురించి అవగాహన కల్పించడం లో ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న అంగన్వాడీ ఉపాధ్యాయుల, కార్యకర్తలు ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుందని, చిన్న వయస్సులో మీ వద్ద ప్రతిరోజూ కనీసం 4 నుంచి 5 గంటల సమయం అక్కడే ఉంటారని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. తల్లితండ్రులపై ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత మనందరిపై కూడా ఉందన్నారు. ప్రధాన న్యాయమూర్తి గారు పేర్కొన్నట్లు బిందూ అనే అంగన్వాడీ టీచర్ కేంద్రం నిర్వహణా, పిల్లల పట్ల చూపుతున్న శ్రద్ద వలన చిన్నారులు తల్లితండ్రులు మిగతా ప్రభుత్వ స్కూల్స్ తరహాలో అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. మనం విధులు నిర్వహించే క్రమంలో చూపే శ్రద్ధ, ఇలాంటి ఘటనలు నిదర్శనం అన్నారు. మంచి పౌరులుగా, సమాజం పట్ల, తల్లితండ్రుల పట్ల, గురువుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించి మంచి పౌరులుగా సమాజం కోసం పాటు పడాలన్నారు.
డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ, పిల్లలు క్రమ శిక్షణతో ఉండి తమ భవిష్యత్తుని తామే నిర్ణయించు కొవాలన్నారు. పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్లబాధ్యత బాధ్యత కలిగి ఉంటే మంచి పౌరులుగా ఉండే అవకాశం ఉందన్నారు. చదువుపట్ల విధేయత కలిగిఉన్న వారు పరిశీలనాత్మక దోరణి వల్ల తప్పకుండా ఉన్నత లక్ష్యాలను సాధించగలుగుతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, కె.విజయ కుమారి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవ రావు , జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్ జ్యోతి, ఏపీ ఎస్సీ పిఆర్ మెంబర్, ఆదిలక్ష్మి, సిడబ్ల్యుసి చైర్ పర్సన్, పి సూర్య ప్రభావతి, డి సి పి ఓ, సి. రాజకుమార్, సిడబ్ల్యూ సి మెంబర్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Check Also

వైద్య విద్యలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తెచ్చింది జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వ‌మే

-పైగా కూట‌మి ప్ర‌భుత్వంపై బుర‌దజ‌ల్ల‌డం స‌మంజ‌స‌మేనా -రూ. 8540 కోట్ల‌కు గాను 1400 కోట్ల‌ను మాత్ర‌మే ఖ‌ర్చు చేశారు -విధ్వంసాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *