Breaking News

చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించేలా పర్యవేక్షించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నిబంధనల ప్రకారం నమోదు చేసుకుని, వాటిల్లో పిల్లలకు కనీస సదుపాయాలు కల్పించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ లో సదుపాయాలు, జేజే యాక్ట్ నిబంధనల అమలు తదితర అంశాలపై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు కలెక్టర్ సమీక్షిస్తూ జిల్లాలో అన్ని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లను పరిశీలించి, నియమ నిబంధనల ప్రకారం రక్షణ, సంరక్షణ కల్పించే పరిస్థితులు, కనీస సదుపాయాలు, వసతులు కల్పించేలా, అవసరమైన రికార్డులు నిర్వహించేలా చూడాలని, సంబంధిత చట్ట నిబంధనల మేరకు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సదుపాయాలు లేని వాటికి నోటీసులు ఇవ్వాలని, సదుపాయాలు లేని సంస్థలలో పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి, వారిని సదుపాయాలు కలిగి ఉన్న ప్రభుత్వ హాస్టల్స్ కు మార్చాలని సూచించారు. మిషన్ వాత్సల్య వెబ్సైట్లో అనాధ పిల్లల వివరాలు నమోదు చేయాలన్నారు. బాల్య వివాహాలు, పోక్సో కేసులు వచ్చినప్పుడు వెంటనే స్పందించి వారికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

విద్య, ఉపాధి పరంగా వారికి లబ్ధి చేకూరేలా జిల్లాలో అనాధలకు అనాధ ధ్రుపపత్రం జారి చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ కార్డులు లేని అనాధ పిల్లలందరికీ వెంటనే ఆధార్ కార్డు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పి.భానుమతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కే సువార్త, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Check Also

హ‌స్త‌క‌ళాభిమానుల‌ను అల‌రించ‌నున్న లేపాక్షీ గాంధీ శిల్ప్ బ‌జార్

– ఈ నెల 22 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు హ‌స్త‌క‌ళా ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, అమ్మ‌కాలు. – ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *