-విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాలకు వివిధ ప్రభుత్వ శాఖల వారికి, స్వచ్చంద సంస్థల వారికి, మీడియా ప్రతినిధులు మరియు అన్నివిధములుగా సహకరించిన ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ది.07.10.2021వ తేదీ నుండి 15.10.2021వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని దసరా పర్వదినంతో పాటు, మూలా నక్షత్రం, విజయదశమి, తెప్పోత్సవం రోజుల్లో భక్తుల రద్దీ దృష్ట్యా నగర ప్రజలకు ట్రాఫిక్ క్రమబద్దీకరిస్తూ, ఎక్కడా కూడా దొంగతనాలు జరుగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అంకిత భావంతో, బాధ్యతగా విధులు నిర్వహించి, విజయ వంతంగా ఉత్సవాలు నిర్వహించుటలో తోడ్పాటు నందించిన దేవాదాయశాఖ, రెవిన్యూ, వివిధ ప్రభుత్వ శాఖలవారికి మరియు ప్రజా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థల వారికి, భక్తులకు, భవానీలకు, మీడియా ప్రతినిధులకు మరియు అన్ని విభాగాల వారికి, వివిధ జిల్లాల నుండి వచ్చిన పోలీస్ అధికారులకు, లోకల్ పోలీసు అధికారులు మరియు సిబ్బందికి విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బి.శ్రీనివాసులు ప్రత్యేకంగా హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.