గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా గూడూరు నందలి ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ , సి.కే.దాస్ అకాడమీ చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ,కందుకూరు మరియు ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గూడూరు వారి సంయుక్త సహాయ సహకారాలతో 30 వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ శాస్త్రీయ ప్రాజెక్ట్ పోటీలను ఘనంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి వై అపర్ణ నిన్న స్థానిక ప్రజా ప్రతినిధుల తో కలిసి ప్రారంభించగా రాష్ట్రం లోని 26 జిల్లాల నలుమూలల నుంచి విచ్చేసిన బాల శాస్త్రవేత్తలు , వారికి మార్గదర్శకత్వం వహించిన మార్గదర్శక ఉపాధ్యాయులు, జిల్లా సమన్వయకర్తలు , అదనపు సమన్వయకర్తలు అందరూ ఈ రెండు రోజులపాటు శాస్త్రీయ ప్రాజెక్టు పోటీలను శాస్త్రీయ దృక్పథం మేలవించేటట్లుగా నిర్వహించారు.
నేటి ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, యువజన అభ్యున్నతి శాఖ మాత్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ….
30వ బాలల సైన్స్ కాంగ్రెస్ కి వచ్చిన బాల శాస్త్రవేత్తలకు, వారిని తయారు చేసిన ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ శాస్త్ర సాంకేతిక మండలి మెంబర్ సెక్రటరీ డా.అపర్ణ గారికి మరియు సైన్స్ అంట్ టెక్నాలజీ అధికారులకు నా అభినందనలని,ముఖ్యంగా ఇంత గొప్ప అవిష్కరణను పూర్తి సహకారం అందించినందుకు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి పాదాభివందనాలు. విద్యలేని వాడు వింతపశువు. విద్య ప్రతి ఒక్కరికి అవసరం. విద్యా, వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనేది లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నోకార్యక్రమాలు చేపట్టారు. ఏ పరిస్ధితుల్లో వున్నా ప్రతి ఒక్కరికి అండగా వున్న ఒకే ఒక్క నాయకుడు మన జగనన్న. ఈరోజు మగపిల్లల కంటే ఎక్కువ అవకాశాలను ఆడపిల్లకు మన రాష్ర్టంలో సృష్ఠించారు జగనన్న. ప్రతి ఆడపిల్లకు సపోర్టివ్ గా వుండే విధంగా విద్యవ్యవస్ధలో నూతన సంస్కరణలు చేపట్టారు మీ మేనమామ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ స్కూల్స్ లోనే అన్ని వసతులు అందించారు. ఫీజు రీయింబర్సు మెంట్ ద్వారా పేద విద్యార్ధుల కలను నిజం చేస్తున్నారు మన జగనన్న.
ఈ జాతీయ బాలల కాంగ్రెస్ సైన్స్ కాంగ్రెస్ ద్వారా 10 నుండి 17 సంవత్సరాల వయస్సు విద్యార్ధులే కాక, బాలబాలికలు ఏవరైనా సరే సైన్స్ పట్ల ఆకర్షితులు అవ్వాలనేది ముఖ్యఉద్దేశం. పిట్టకొంచెం కూత ఘనం. 10 నుండి 15 సంవత్సరాల విద్యార్ధులు…తమ క్రియేటివీకి పదును పెట్టి దాదాపుగా 182 ప్రాజెక్టులను ఆవిష్కరించారు..అందులో 17 ప్రాజెక్టులు ఎంపిక చేయబడ్డాయి. విజేతలకు నా అభినందనలు. పార్టిసిపేట్ చేయడమే విజయానికి మొదటి మెట్టు. సెలక్ట్ కాబడిన ప్రాజెక్టులను జాతీయ స్ధాయికి వెళ్తాయి. మరింతగా మీ మేధస్సును పదునుపెట్టండి. ఆంధ్రస్టూడెంట్స్ ఆషామాషీ కాదు. అద్బుతమైన స్కీల్స్ మీ సొంతం. ఎడ్కుకేషన్ అంటే క్వాలిఫికేషన్ కాదు. క్వాలిటీ. మార్కుల కోసం తల్లిదండ్రులు కొంతమంది పిల్లల పట్ల ఇబ్బందిగురిచేయడం మనం చూస్తున్నాం. చదవు ముఖ్యం కాని సొసైటీలో ఏలా జీవించాలి, ధైర్యంగా ఎలా వుండాలనేది మరింత ముఖ్యం. ప్రతి ఆడపిల్లా ప్లవర్ కాదు… ఫైర్… ఆడపిల్లలు కాదు. ఆడపులులు. ఆడపిల్లలకు ఎప్పుడూ సపోర్టుగా వుండాలి. అన్నింటా మనకు షరతులు వుంటాయి. టాలెంట్ ని నిరూపించుకునే అవకాశాలకు దూరంగా ఉండిపోతాం. ఆడపిల్లల తల్లిదండ్రులు, చూట్టూ వుండే ప్రెండ్స్ ఎంకరేజ్ చేయాలి. నా కుటుంబంలో తల్లిదండ్రులు, నా భర్త, అన్నయ్యలు నాకు ఎప్పుడూ సపోర్ట్ గా వుండేవారు, ఫ్రెండ్స్ గా అన్ని విషయాలను షేర్ చేసుకునేవారు. అదే నా విజయాలకు కారణం అయ్యాయి.
ప్రతి ఆడపిల్ల కల సాకారం కావాలి. మేనమామ జగనన్న మీకు అండగా వున్నారు. ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయబడిన సైన్స్ ప్రాజెక్ట్ ల సంఖ్య ఇంకా పెరగాలి. ఉత్తమైనవి గా వుండాలి. బాల శాస్ర్తవేత్తలకు ఉఝ్వల భవిష్యత్తు వుండాలి. నా కూతురు ఆలోచన కూడా శాస్త్రవేత్త కావాలని. తన గొప్ప నిర్ణయాన్ని నేను గౌరవించా. మీరందరూ కూడా మరింతగా రాణించాలి. ఉన్నత శిఖరాల వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించాలి అన్నారు.
30th బాలల సైన్స్ కాంగ్రెస్ లో 17 ప్రాజెక్ట్ లకు గాను రాష్ట్ర స్థాయి లో గెలిచిన జిల్లా వారీగా విద్యార్థులను అభినందించి మంత్రి చేతుల మీదుగా బహుమతి, సర్టిఫికెట్, మెడల్ లు బహూకరించారు.
ఈ కార్యక్రమంలో ఆప్ కాస్ట్ మెంబెర్ సెక్రటరీ అపర్ణ , ఆదిశంకర కాలేజ్ ఛైర్పర్సన్ పెంచలయ్య, జడ్పీ చైర్మన్ అనం అరుణమ్మ, సైన్స్ సిటీ CEO Dr.K. జయరాం రెడ్డి, SCERT డైరెక్టర్ B. ప్రతాప్ రెడ్డి గారు, deo శేఖర్, అప్ కాస్ట్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.