Breaking News

గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒకటే మార్గం

-బాల్యవివాహాలను అమ్మాయిల తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దు జిల్లా కలెక్టర్ డా. ఎస్ వేంకటేశ్వర్
-స్త్రీ, పురుష అనే బేధం లేకుండా అమ్మాయిలను తల్లిదండ్రులు బాగా చదివించాలి : ఎస్ టి కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక బైరాగిపట్టేడ గిరిజన భవనం నందు బర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ, ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్, గిరిజన సంఘాల నాయకులు తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బిర్సా ముండా నీ స్ఫూర్తిగా తీసుకొని గిరిజన విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని తెలిపారు. గిరిజన అమ్మాయిలు పదవ తరగతి వరకు చదివి ఆపై చదువు మానేసి పెళ్లిళ్లు చేసుకోవడం వలన వారు అనుకున్న కలలను ఎప్పటికీ నెరవేర్చుకోలేరని తెలిపారు. ఉన్నత చదువుల వైపు ఆసక్తి పెంచుకోవాలన్నారు. కావున ప్రతి గిరిజన అమ్మాయిలు పదవ తరగతి వరకే కాకుండా ఉన్నత చదువులు చదివించాల్సిన బాధ్యత వారు తల్లిదండ్రులది అని తెలిపారు. బాల్య వివాహాలను నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒకటే పరిష్కారం చూపదు ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గిరిజన సంఘాలు కూడా బాల్య వివాహాలు నిర్మూలన దిశగా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం వలన వెంటనే గర్భం దాల్చడం, ఆరోగ్య సమస్యలు రావడం చదువుకు కూడా దూరం కావాల్సి వస్తుందని, తల్లిదండ్రులు పెళ్లిళ్లకు ప్రయత్నించిన మీరే తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇంకా చదువుకోవాలి అని తెలపాలి అన్నారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ఎవరు మర్చిపోకూడదని తెలిపారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ గిరిజనుల సాంప్రదాయాలు, సంస్కృతి మరుగున పడిపోకుండా ఉండాలి అంటే స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి ముఖ్య కార్యక్రమాలలో సాంస్కృత కార్యక్రమాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
జిల్లాలో గిరిజన వసతి గృహాలలో వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను, సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రతి గిరిజన విద్యార్థి విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆశిస్తున్నానని తెలిపారు.

ఎస్టీ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల జీవితాన్ని వారు కష్టసుఖాలను తెలుసుకునే విధంగా జన్ జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం మహనీయులు చేసిన కృషిని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రతి గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మన గిరిజన విద్యార్థులు చదువు సంస్కారంలో దేనిలోనూ తక్కువ కాదు కాబట్టి బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మన జాతి మన కుటుంబాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయని అన్నారు. స్త్రీ, పురుష అనే భేదం లేకుండా అమ్మాయిలను బాగా చదివించాలి అప్పుడే సమాజంలో మార్పు అనేది వస్తుందని తెలిపారు. నేటికీ రేషన్, ఆధార్ ఓటర్ కార్డులు లేని ఎన్నో గిరిజన కుటుంబాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వము అమలు చేసే ప్రతి సంక్షేమ పథకానికి సద్వినియోగం చేసుకొనేల వీటిని రెడీ చేసుకోవానెల ఉండాలని తెలిపారు. మనం ఏ స్థాయిలో ఉన్న మన మూలాలు మరిచిపోకూడదని మన గిరిజ కుటుంబాలు అందరూ కూడా సమైక్యంగా ఉన్నప్పుడే మన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చు అని తెలిపారు.

జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతినీ ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాల్లో జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోది ఈ రోజు బీహార్ లో రూ.6600 కోట్లతో గిరిజనుల సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. గిరిజన సంక్షేమం దిశగా ధర్తీ ఆబ జంజాతీయ ఉత్కర్ష అభియాన్ పథకమును ప్రవేశపెట్టబడిందని ఈ పథకం కింద తిరుపతి జిల్లాలో మూడు మండలాలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ మండలాల అభివృద్ధి కోసం 17 శాఖల సమన్వయంతో అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసి కలెక్టర్ ఆధర్వంలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. బిర్సా ముండా గిరిజన జాతిలో చైతన్యం కలిగించిన నాయకుడని అలాగే బిఆర్ అంబేద్కర్ అగ్రవర్ణాలతో మనం కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక చట్టాలను తీసుకురావడం జరిగిందని ఈ అవకాశాన్ని గిరిజనులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు.

Check Also

మంత్రి సవితకు సీపీఐ రామకృష్ణ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *