Breaking News

Andhra Pradesh

డయేరియా వలన ఏ ఒక్క మరణం సంభవించకూడదు

-ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమాయత్తం కావాలి -ఫ్రైడే – డ్రై డే” పై ప్రజలందరికి అవగాహన కల్పించాలి -వైద్యాధికారులు, ఐ సి డి ఎస్ అధికారులు సమన్వయం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నీటి ద్వారా సంక్రమించే డయేరియా వంటి వ్యాధులు సంక్రమించకుండా అంగన్వాడీ టీచర్లు , ఆషా వర్కర్లు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదృత అతిసార పక్షోత్సవాలు నేపథ్యంలో సమన్వయ శాఖలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. …

Read More »

ఆరోగ్యవంతమైన పరిసరాలు కొరకు ప్రతి ఒక్కరం మొక్కలు నాటి వాటిని సంరక్షిద్దాం ..

-జిల్లా కలెక్టర్ కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కై కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం స్పందన కార్యక్రమం అనంతరం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శ్రీధర్ డి ఆర్ వో సుబ్బారావు, బ్రహ్మ కుమారీస్ గ్రామీణాభివృద్ధి సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ …

Read More »

నగరంలో ఉన్న అనధికార ఫ్లెక్సీ లను తొలగించండి

– కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ కమిషనర్ , రూడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ ఈరోజు స్పందన కార్యక్రమం లో నగరపాలక సంస్థ పరిధిలో 23 ఫిర్యాదులు అందాయన్నారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ మీ-సేవ కేంద్రాలకు వచ్చి సేవలను ప్రజలు పొందుతున్నారని తెలిస్తే , అటువంటి సచివాలయల్లో వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సరిగ్గా పని …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-ఆయా సంక్షేమ కార్యక్రమాలు అమలులో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం చేయండి -స్పందనలో 126 ఫిర్యాదులు నమోదు అయ్యాయి- కలెక్టర్ డా. కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదును మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత కాల పరిమితి లో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ , డిఆర్వో బి.సుబ్బారావు తో కలిసి …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు

-ఈనెల 9న అమరావతిలో జరగనున్న శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు విచ్చేయాలని ఆహ్వానం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని వెంకటపాలెంలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 9న జరగనున్న విగ్రహ ప్రాణప్రతిష్ట, మహాసంప్రోక్షణకు విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 4 నుంచే ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని.. …

Read More »

అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న సర్ విజ్జీ స్విమ్మింగ్‌ పూల్

-పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుంకుంటున్న సర్ విజ్జీ స్విమ్మింగ్‌ పూల్ ని త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36వ డివిజన్ గాంధీనగర్ లోని సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్ ను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ లతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని …

Read More »

పేదల సొంతింటి కలను అడ్డుకుంటున్న చంద్రబాబు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-36 వ డివిజన్ – 193 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : పేదల సొంతింటి కల సాకారం దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాలు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36 వ డివిజన్ – 193 వ వార్డు సచివాలయం పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గాంధీ నగర్ పరిధి సీఎస్ఆర్ రోడ్డు, …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్దిని అందిస్తాం : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మరో ముప్పైఏళ్లు ముఖ్యమంత్రి గా కొనసాగే విధంగా ప్రజలు దీవించాలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్ 5వ సచివాలయ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీ నందు స్థానిక డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్(బాబీ) తో కలిసి తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇంటి …

Read More »

తదుపరి విద్యాబ్యాసంలో మరిన్ని విజయాలను సాధించి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుకొని 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాదించిన విద్యార్ధిని, విధ్యార్ధులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అభినందనలు తెలియజేస్తూ, తదుపరి విద్యాబ్యాసంలో మరిన్ని విజయాలను సాధించి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. April,2022 లో నిర్వహించబడిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో విజయవాడ నగర పాలక సంస్థ 29 ఉన్నత పాఠశాలల నుండి …

Read More »

పదవ తరగతి పరీక్షల్లో అత్యదిక మార్కులతో ఉత్తీర్ణత సాదించిన విద్యార్ధిని, విధ్యార్ధులు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుకొని 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షల్లో అత్యదిక మార్కులతో ఉత్తీర్ణత సాదించిన విద్యార్ధిని, విధ్యార్ధులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అభినందనలు తెలియజేస్తూ, తదుపరి విద్యాబ్యాసంలో మరిన్ని విజయాలను సాధించి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. April,2022 లో నిర్వహించబడిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో విజయవాడ నగర పాలక సంస్థ 29 ఉన్నత …

Read More »