అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని వచ్చే మార్చి నాటికి మరొక 50వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయటానికి లక్ష్యాలను నిర్దేశించాలని రాష్ట్ర గృహనిర్మాణం,సమాచార పౌరసంబందాల శాఖ మంత్రి శ్రీ కొలుసు.పార్ధసారధి అధికారులను ఆదేశించేరు.రాష్ట్రంలో అమలు అవుతున్న గృహనిర్మాణల పై మంత్రి సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేరు.రాష్ట్రంలో పూర్తి అయిన లక్ష ఇళ్ల నిర్మాణలకు త్వరలో ప్రారంభించి లబ్ధిదారులుకు ఇంటి తాళాలు అందించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించేరు.రాష్ట్రంలో ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొంటారని,మిగిలినజిల్లాలలో మంత్రులు,శాసనసభ్యులు,ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తారని,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించేరు.
ఇళ్ళు నిర్మాణాలు జరిగిన కాలనీలకు మౌలిక సదుపాయాలు కలిగించాటానికి చర్యలు చేపట్టాలని, పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్,విద్యుత్ తదితర అధికారులతో సమావేశలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించాలని,మంత్రి ఆదేశించేరు.అవసరమైతే పంచాయితీరాజ్,రహదారులు,భవనాలు,పురపాలక శాఖ మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిధులు విడుదలకు మంత్రుల స్థాయిలో సమావేశాలు నిర్వహిద్దామని మంత్రి శ్రీ పార్ధ సారధి వివరించేరు.ప్రతీ రోజు జిల్లా అధికారులుతో సమావేశాలు నిర్వహించాలని,ఇళ్లనిర్మాణాలలో నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించేరు.రాష్ట్ర గృహా నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కే.రాజబాబు రాష్ట్రంలో లక్ష ఇళ్ల ప్రారంభోత్సవాలకు తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు.ఈ సమావేశంలో గృహనిర్మాణ సంస్థ చీఫ్ ఇంజినీర్ శ్రీ జీ.వీ.ప్రసాద్,సూపరేండెంట్ ఇంజినీర్లు శ్రీ జయరామాచారి,శ్రీ నాగభూషణం ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News