– కె. దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ కమిషనర్ , రూడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ ఈరోజు స్పందన కార్యక్రమం లో నగరపాలక సంస్థ పరిధిలో 23 ఫిర్యాదులు అందాయన్నారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ మీ-సేవ కేంద్రాలకు వచ్చి సేవలను ప్రజలు పొందుతున్నారని తెలిస్తే , అటువంటి సచివాలయల్లో వాలంటీర్లు క్షేత్రస్థాయిలో సరిగ్గా పని చెయ్యడంలేదని భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలవద్దకు వెళ్లి వాలంటీర్ ప్రజాసమస్యల పై పరిశీలన చేసి పరిష్కారం అన్నారు. వాలంటీర్లు ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో నిబద్ధతతో విధులు నెరవేర్చాలని నిర్వర్తించాలని స్పష్టం చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన సచివాలయం నుంచే సేవలు అందించే సామర్థ్యం కలిగిన విషయాన్ని వారికి తెలియ పరచాల్సిన భాధ్యత వాలంటీర్, సచివాలయ సిబ్బంది అని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో అనధికారికంగా ఉన్న ఫెక్సీ లను తొలగించే బాధ్యత టౌన్ ప్లానింగ్, ప్లానింగ్ సెక్రెటరీ లు తీసుకోవాలన్నారు. నగరంలో 18 అధారైజ్డ్ ఫ్లెక్సీ తయారీ దారులు ఉన్నారు. కార్పొరేషన్ తరపున ఆమోదం పొందిన ఫ్లెక్సీ లు, హార్డింగ్ లను మాత్రమే ప్రదర్శించడానికి అవకాశం ఉందని తెలిపారు. నిర్దుష్ట మార్గదర్శక లను అనుసరించి ఆయా బోర్డు లను, ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయాలని, అలా లేని ఆమోదం పొందిన వాటిని కూడా తొలగించాలన్నారు. స్పందన కార్యక్రమం సంబంధించిన నగర పాలక సంస్థ అధికారులు,అదనపు మునిసిపల్ కమీషనర్ పి. వి. సత్యవేణి, ఇంజనీరింగ్ ఇతర అధికారులు ఎస్ ఈ జి.పాండురంగారావు, జే.సూరజ్ కుమార్, డా.వినూత్న, , వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News