Breaking News

పదవ తరగతి పరీక్షల్లో అత్యదిక మార్కులతో ఉత్తీర్ణత సాదించిన విద్యార్ధిని, విధ్యార్ధులు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలలో చదువుకొని 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి పరీక్షల్లో అత్యదిక మార్కులతో ఉత్తీర్ణత సాదించిన విద్యార్ధిని, విధ్యార్ధులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అభినందనలు తెలియజేస్తూ, తదుపరి విద్యాబ్యాసంలో మరిన్ని విజయాలను సాధించి మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

April,2022 లో నిర్వహించబడిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో విజయవాడ నగర పాలక సంస్థ 29 ఉన్నత పాఠశాలల నుండి ఇంగ్లీష్ మీడియo నందు హాజరైన విద్యార్థులు: 2519 ఉత్తీర్ణులైన విద్యార్థులు: 1228 ఉత్తీర్ణత శాతం: 49% తెలుగు మీడియం నుండి హాజరైన విద్యార్థులు :156 ఉత్తీర్ణులైనవారు :37 ఉత్తీర్ణత శాతం: 23%, ఉర్దూ మీడియం నుండి హాజరైన వారు : 53 ఉత్తీర్ణులైనవారు :44 ఉత్తీర్ణత శాతం :83%, నాలుగు ఉర్దూ మీడియం పాఠశాలలో SNMC ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాల, వించిపేట నందు 100% ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా APJAKMC ఉర్దూ హై స్కూల్, అరండల్ పేట 88% తో ద్వితీయ స్థానంలో నిలిచింది.

ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో VMRR MCSGHS, బాలికల ఉన్నత పాఠశాల 70% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. 67% ఉత్తీర్ణత శాతంతో GDETMCHS ద్వితీయ స్థానంలోనూ, 63% ఉత్తీర్ణత శాతంతో తృతీయ స్థానంలో నిలిచింది.

ఇంగ్లీష్ మీడియం పాఠశాలల నుండి AKTP నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, సత్యనారాయణపురం నుండి M.Jagadish, 600 మార్కులకుగాను 587 మార్కులు సాధించి విజయవాడ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలల నందు టాపర్ గా నిలిచాడు, SBVSRMCHS, కండ్రిక నుండి Patan Mehaboob Sulthana, 584 మరియు GDETMCHS, పటమట నుండి M.Gracy Sadhana, 584 మార్కులు పొంది ద్వితీయ స్థానంలో నిలిచారు. అదే విధముగా TMRCMCHS, మాచవరం నుండి Jaswanth Kumar 582 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *