Breaking News

Latest News

దావోస్ లో మూడో రోజూ సీఎం చంద్రబాబు పర్యటన

-పారిశ్రామిక పురోగతి పై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే సెషన్ లో ప్రసంగించనున్న సీఎం -దావోస్ లో వివిధ పారిశ్రామిక వేత్తలతో భేటీకానున్న ముఖ్యమంత్రి దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా మూడో రోజూ కీలకమైన సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో ముఖాముఖి భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో జరిగే పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. హొరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్ …

Read More »

రాష్ట్రంలో యువతకు ఏఐ, క్వాంటం, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ

-10 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని ఐబీఎం సీఈవోను కోరిన సీఎం -క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆహ్వానం -దావోస్‌లో దిగ్గజ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం, సైబర్ సెక్యూరిటీ నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐబీఎం చైర్మన్, సీఈవోను కోరారు. దావోస్ పర్యటన రెండోరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఐబీఎం చైర్మన్ అర్వింద్ కృష్ణ తో సమావేశం …

Read More »

అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి

-ఓ తరం అభివృద్ధి చెందేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి -లోకల్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహం -దావోస్ వేదికగా ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు -ప్రపంచ ఆర్థిక సదస్సులో జరిగిన చర్చా వేదికలో ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానానికి కితాబు దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : అభివృద్ధి అనేది ఏ ఒక్కరికో పరిమితం కాకూడదని… అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి… అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ …

Read More »

విదేశీ పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం ఇండియానే.

-నేషన్ ఫస్ట్ అన్నదే టీమ్ ఇండియా నినాదం -రాష్ట్రాలుగా వేరైనా… దేశంగా మేం అంతా ఒక్కటే -సంపదతో పాటు ప్రజల జీవన ప్రమాణాలపైనే మా దృష్టి -దావోస్‌లో కేంద్ర మంత్రులు, సీఎంలు, మంత్రులతో కలిసి ఇండియా లాంజ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం భారతదేశమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని ఆయన అన్నారు. దేశం వేగంగా మార్పు చెందుతోందని స్పష్టం చేశారు. …

Read More »

ఏపీలో ఆర్ఎంజడ్ సంస్థ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

-దావోస్ లో మంత్రి లోకేష్ సమక్షంలో ఆర్ఎంజడ్ ప్రకటన దావోస్ (స్విట్జర్లాండ్), నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజడ్(RMZ) సంస్థ ముందుకు వచ్చింది. ఈ రోజు దావోస్ లో ఆర్ఎంజడ్ ఛైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేష్ జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్ఎంజడ్ సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖనగరంలో జీసీసీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం …

Read More »

పెట్టుబడులకు ఏపీని మించింది లేదు

-రాష్ట్రానికి రండి… పరిస్థితులు గమనించండి -దావోస్ వేదికపై పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు -‘ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్’ అంశంపై సీఎం ప్రసంగం దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీని మించిన అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం అతిపెద్ద మార్కెట్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికపై అన్నారు. ఏపీకి వచ్చి రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోన్న పాలసీలు, పెట్టుబడులకు ఉన్న సానుకూల పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ …

Read More »

ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌కు యూఏఈ తోడ్పాటు

-యూఏఈ ఆర్థిక మంత్రి అల్ మార్రీతో సీఎం చంద్రబాబు భేటీ -మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌ ఏర్పాటుపైనా చర్చ -దావోస్ (స్విట్జర్లాండ్), నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ …

Read More »

విద్యార్థుల వసతి గృహాల తనిఖీల కోసం జాయింట్‌ యాక్షన్ కమిటీలు

-9 ప్రభుత్వ శాఖల అధికారులతో ఏర్పాటుకు ఆదేశాలు -జిల్లా కలెక్టర్లకు పంపిన‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ -తనిఖీల్లో గమనించాల్సిన అంశాల గురించి కూడా స్పష్టీకరణ -క్యాలెండర్ ప్రకారం క్ర‌మం త‌ప్ప‌కుండా, ఆకస్మిక తనిఖీలు జరపాలని వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ విద్యా సంస్థలు, సంక్షేమ శాఖల వసతి గృహాల్లో విద్యార్థులు ఆనారోగ్యం బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, సత్వరం తీసుకోవాల్సిన చర్యల కోసం తనిఖీల నిమిత్తం 9 ప్రభుత్వ శాఖల అధికారులతో జాయింట్‌ యాక్షన్ …

Read More »

నూతన ఆర్టీఐ కమీషనర్లచే ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు నూతనంగా నియమితులైన కమీషనర్లచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రమాణ స్వీకారం(Oath taking ceremony) చేయించారు.ఈమేరకు మంగళవారం ఎపి సచివాలయంలో నూతన కమీషనర్లతో ప్రమాణం చేయించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమీషన్ కు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ కమీషనర్ సహా ఇతర కమీషనర్లను నియమించడం జరిగింది.రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నూతన కమీషనర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.రాష్ట్ర …

Read More »

జిల్లాలో కర్ణాటక ఉన్నతస్థాయి అధ్యయన బృందం పర్యటన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కన్నడ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కేఎం గాయత్రి సారథ్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన కర్ణాటక ఉన్నతస్థాయి అధ్యయన బృందం జిల్లాలో పర్యటించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ భాష, సాంస్కృతిక శాఖతో పాటు మైనారిటీ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బృంద సభ్యులు కలిశారు. కర్ణాటకలో ద్రావిడ భాష తుళును రెండో అధికారిక భాషగా గుర్తించాలనే సంకల్పం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ద్వితీయ భాషగా ఉర్దూ అమలు తీరును …

Read More »