-ప్రధాని పర్యటన, ఆటో డ్రైవర్ల సేవలో, జీఎస్టీ ఉత్సవ్‌పై భేటీలో చర్చ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్ర జ్వరంతో బాధపడుతోన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు ఆదివారం వెళ్లారు. ఆరోగ్య పరిస్థితిని గురించి పవన్ కళ్యాణ్‌ను అడిగి తెలుసుకున్నారు. జ్వరం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ అంశంపై డిప్యూటీ సీఎం …
Read More »Movie News
‘ఓజీ’ చిత్రానికి సహకరించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు
-అభిమానుల ఉత్సాహం మరువలేనిది -చిత్ర దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ఓజీ’ చిత్రానికి సహకారం అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సినిమా పరిశ్రమకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుతున్న ప్రోత్సాహకాలకు ఇరువురు ముఖ్యమంత్రులూ చూపిస్తున్న చొరవే కారణం. ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన ‘ఓజీ కన్సెర్ట్’కు అనుమతులు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం …
Read More »ఏ రంగంలోనైనా నెంబర్.1 బాలయ్యే!
-సేవా తత్పరతలో భోళా శంకరుడు -వరల్డ్ బుక్ హీరో బాలకృష్ణ సత్కార సభలో మంత్రి లోకేష్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా హీరో నందమూరి బాలకృష్ణ వలనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇటీవల వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన బాలకృష్ణకు హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… 50 ఇయర్స్ ఇండస్ట్రీ. సినిమా, సేవా కార్యక్రమాలు, …
Read More »జనసేన విజయం దేశ రాజకీయ చరిత్రలో ఓ మైలురాయి
– నో సీట్ టూ వన్ సీట్, వన్ సీట్ టూ 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాం – జాతీయ వాదం కలిగిన ప్రాంతీయ పార్టీ జనసేన – పార్టీ నడపడానికి వేల కోట్లు కాదు బలమైన భావజాలం కావాలి – జనసేన పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి పరిహారం అందింది – అప్పటి వైసీపీ ప్రభుత్వం కేసు సీబీఐకి అప్పగించినట్లు నాటకం ఆడింది – స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు జనసేన పార్టీ మొదటి నుంచి పోరాటం చేసింది …
Read More »“వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు”
-భారతీయ సినిమాలో 50 సంవత్సరాలు హీరోగా గుర్తింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR), యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా మరియు యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ, వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాలలో ఒకదాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణ కి ప్రదానం చేస్తున్నారు – భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు WBR గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ …
Read More »చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు
-ఔరంగజేబు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు -జిజియా పన్నుపై సినిమాలో సునిశితంగా చర్చించాం -మొఘల్స్ పాలనలో మంచితో పాటు చెడును చెప్పాం -నా సినిమాను బాయ్ కాట్ చేసినా నాకు ఫరక్ పడదు -నా అభిమానులే నాకు కొండంత బలం -శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి -హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘చరిత్రలో భారతదేశ రాజులు, రాజ్యాలు, వారి …
Read More »ప్రజా కంటకుడిపై వీరమల్లు వీరోచిత పోరాటం అబ్బురపరుస్తుంది
-ఎన్నో ఆటంకాలు ను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న గొప్ప చిత్రం ఇది -చరిత్రలోని అసలు నిజాలను కల్పిత పాత్ర ద్వారా నేటి తరానికి చెప్పే ఆలోచన చేశాం – కీరవాణి అద్భుత సంగీతం చిత్రానికి మరింత బలం ఇచ్చింది -ఉత్తరాంధ్ర నేల నాకు నటన నేర్పి… అన్నం పెట్టిన కర్మభూమి -హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలి అనే రోజులను చిత్రంలో చూపించాం -చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు స్వయంగా నేనే దర్శకత్వం వహించా -నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి …
Read More »ధర్మం కోసం నిలబడే విల్లు… హరిహర వీరమల్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కోహినూర్ వజ్రం మొగల్స్ వద్దకు ఎలా చేరిందో చెప్పే సున్నితాంశం. మేకప్ అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టిన ఎ.ఎం. రత్నం లాంటి వారికి అండగా నిలిచేందుకే చిత్ర ప్రమోషన్లు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని బయటకు వస్తున్న గొప్ప చిత్రంగా …
Read More »నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మరియు మతం ద్వారా కాదు… : రజనీకాంత్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. మహ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై 50 వేల రూపాయలు దొరికినవి, అతను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ డబ్బును పోలీసు అధికారికి ఇచ్చి “నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది దీని యజమాని ఎవరో కనుగొని దానిని తిరిగి వారికి ఇవ్వండి” అని అన్నాడు. దానికి పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదని …
Read More »ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మ్యూజికల్ నైట్ కోసం దేవి శ్రీ ప్రసాద్ ఆహ్వానం
-ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తో కలిసి ముఖ్యమంత్రిని ఆహ్వానించిన దేవిశ్రీప్రసాద్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మర్యాదపూర్వకంగా కలిసిన సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. ఈ నెల 19న జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించిన దేవిశ్రీప్రసాద్. ఆయనతో పాటు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు.
Read More »
Prajavartha Online Telugu News