Breaking News

నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మరియు మతం ద్వారా కాదు… : రజనీకాంత్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు. మహ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై 50 వేల రూపాయలు దొరికినవి, అతను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ డబ్బును పోలీసు అధికారికి ఇచ్చి “నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది దీని యజమాని ఎవరో కనుగొని దానిని తిరిగి వారికి ఇవ్వండి” అని అన్నాడు. దానికి పోలీస్ అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచుకోలేదని అడిగాడు. అంటే దానికి యాసిన్ ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు నాది కాదని దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలనని బదులిచ్చారు. అతని నిజాయితీని మెచ్చిన పోలీసు అధికారి నీకు నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని యాసిన్‌ ను అడిగాడు. వెంటనే యాసిన్ నాకు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులు ఇట్టి విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్‌ కు తెలియజేయగా అందుకు స్పందించిన రజనీకాంత్ యాసిన్‌ ను తన వద్దకు తీసుకు రమ్మని తెలిపారు. ఈ సందర్బంగా రజనీకాంత్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఈ పిల్లవాడి చదువు ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని వాగ్దానం చేశాడు. అతను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల/కళాశాలలో చదువు కోవచ్చని తెలిపారు. ఇప్పటి నుండి నేను ఈ బిడ్డను నా సొంత కొడుకులా చూసుకుంటానన్నారు. నిజాయితీ అనేది పుట్టుకతోనే ఉంటుంది, కులం మరియు మతం ద్వారా కాదని సూపర్ స్టార్ రజనీకాంత్‌ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *