Breaking News

Telangana

పసివేదల, వేములూరు, నందమూరు మహిళలకు రూ. కోటి 26 లక్షలు ఆసరా

-వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ.. -మంత్రి తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు సంతోషంగా ఉండి, మీ కుటుంబాల కు ఆధారంగా ఉండాలని, మహిళలు ఆర్ధిక, సామాజిక సాధికారత దిశగా అడుగులు వెయ్యలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం పసివేదల గ్రామంలో పసివేదల, వేములూరు, నందమూరు గ్రామాల వైఎస్సార్ ఆసరా రెండో విడత సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి …

Read More »

ప్రజల సంక్షేమం జగనన్న ప్రభుత్వ లక్ష్యం…

-కొవ్వూరు పట్టణ పరిధిలో వైఎస్సార్ ఆసరా 2వ విడత రూ. 4 కోట్ల 35 లక్షలు విడుదల -సమాజంలో మహిళలకు భద్రత, భరోసా కల్పించడం చేస్తున్నాము – మహిళల సాధికారత , ఆర్ధిక భరోసా , భద్రతకై జగనన్న నిత్యం ఆలోచన చేస్తున్నాం.. -దిశా యాప్ ను ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ -మంత్రి తానేటి వనిత కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు పురపాలక సంఘం పరిధిలో వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండో విడతలో 543 స్వయం సహాయక సంఘంకి …

Read More »

జాతికి వన్నె తెచ్చిన క్రీడాకారిణికి సత్కారం… : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా లో జరిగిన ప్రపంచ అర్చరీ ఛాంపియన్షిప్ పోటీలలో మూడు సిల్వర్ మెడల్స్ గెలుచుకున్న క్రీడాకారిణి కుమారి వెన్నం జ్యోతి సురేఖ గారిని ఈ రోజు వారి స్వగృహం నందు తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ కలిసి చిరు సత్కారం చేయటం జరిగినది. ఈ సందర్భంలో అవినాష్ గారు మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని వారిని మనం ప్రోత్సహిస్తే ఇలాంటి మరి ఎన్నో పధకాలును దేశానికీ అందిస్తారు అని అన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి …

Read More »

వైయస్సార్ ఆసరాతో మహిళలకు ఆర్థిక భరోసా… : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలు అమలు చేస్తూ ప్రతి పధకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం జెమ్మిచెట్టు సెంటర్, బోయపాటి శివరామకృష్ణ మున్సిపల్ హైస్కూల్ జరిగిన వైయస్సార్ ఆసరా రెండవ విడత నగదు మంజూరు అయిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 7,8 డివిజిన్ల లబ్ధిదారులతో నిర్వహించిన ఆసరా సంబరాలు …

Read More »

అమరావతిలో శాశ్వతరాజధానిపై పునరాలోచనా చేయాలి…

-మోతడక ధర్న శిబిరంలో సిపిఐ నేత ముప్పాళ్ల -666వ రోజుకు చేరిన దీక్షలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రాజధానులు ఆంధ్ర ప్రదేశ్‌ నాశనానికి దారి తీస్తాయి. అమరావతిలోనే ఒకే ఒక్క శాశ్వత రాజధాని కొనసాగుంపుకై తక్షణం పునరాలోచన చేయాలంటూ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేసారు. అమరావతిలో రాజధాని కొనగాగింపుకై గుంటూరు జిల్లా మోతడక గ్రామంలో జరుగుతున్న దీక్షలు 666వ రోజుకు చేరిన సందర్భంలో బుధవారం ధర్నా శిబిరంలో మహా సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిధిగా …

Read More »

ఆశ్వయుజ శుద్ధ అష్టమి, బుధవారము, శ్రీ దుర్గా దేవి (దుర్గాష్టమి)…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే | భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే || శరన్నవరాత్రి మహోత్సవములలో అష్టమి తిథి నాడు శ్రీకనకదుర్గమ్మ వారు శ్రీ దుర్గా దేవి గా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంఠకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందినది. లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీ అమ్మవారు ఆవిర్భవించింది. ‘దుర్గే దుర్గతినాశని’ అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగచేస్తుంది. శరన్నవరాత్రుల యందు దుర్గాదేవిని అర్చించటం వలన …

Read More »

విజయవాడ చేరుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా…

-స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ జె. నివాస్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం గౌరవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మంగళవారం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాన్ని అందజేశారు. రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ .పి .సిసోడియా కూడా జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి …

Read More »

క్లీన్ ఇండియా…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర విజయవాడ వారి ఆధ్వర్యంలో స్థానిక బాపు మ్యూజియం నందు క్లీన్ ఇండియా ప్రోగ్రాం లో భాగంగా ఐకానిక్ ప్లేస్ యాక్టివిటీ కింద కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి  శాసనసభ్యులు మల్లాది విష్ణు  ముఖ్య అతిథిగా హాజరు అవ్వ గా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు డాక్టర్ జి వాణిమోహన్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు  …

Read More »

ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తు జవాబుదారిగా వుండండి…

-ప్రజలకు సత్వర సేవలన్నదే సచివాలయ వ్యవస్థ ముఖ్యఉద్దేశం… – పి ఆర్ కమీషనర్ కోన శశిధర్ విజయవాడ/కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : సామాన్య ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సకాలంలో సేవలు అందించి ప్రజల పట్ల జవాబుదారీగా వుండాలని పంచాయతీ రాజ్, గ్రామీణభివృధ్ది శాఖ కమిషనర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధి కమిషనర్ గా నియమితులైన కోన శశిధర్ గ్రామ సచివాలయాల వ్యవస్థ పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని పరిటాల 1,2 గ్రామ సచివాలయాలను మంగళవారం సందర్శించారు. వీరి …

Read More »

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ….

-పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేదపండితులు అధికారులు విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మవారికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. తాడేపల్లి లోని సియం క్యాంపు కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా ముఖ్యమంత్రి దుర్గగుడికి చేరుకున్నారు. వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. తొలుత ఇంద్రకీలాద్రి పైకి చేరుకున్న ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, …

Read More »