Breaking News

Telangana

విజయవాడ, బెంజి సర్కిల్‌లో మొదటి ‘విష్‌ గ్రిల్‌’ రెస్టారెంట్‌ను ప్రారంభించిన అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ బార్బెక్యూ రెస్టారెంట్‌ల గొలుసుకట్టు అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ (ఎబి) తన 45 వ రెస్టారెంట్‌ను 2వ అంతస్థు, 40-1-68/69, వజ్ర కమర్షియల్‌ కాంప్లెక్స్‌, బెంజి సర్కిల్‌, ఎమ్‌జి రోడ్‌, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌- 520010 చిరునామాలో ప్రారంభించింది. దీనితో వైజాగ్‌ అవుట్‌లెట్‌ తరువాత అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ (ఎబి) ఆంధ్రప్రదేశ్‌లో తన 2వ ఔట్‌లెట్‌ను ప్రారంభించినట్లయ్యింది. అబ్సల్యూట్‌ బార్బెక్యూస్‌ కస్టమర్‌-ప్రాముఖ్యత గురించి మాట్లాడటమే కాకుండా తన సామాజిక బాధ్యతను కూడా అర్థం చేసుకుంటుంది మరియు ఎల్లప్పుడూ సమాజానికి తిరిగి ఇవ్వడానికి …

Read More »

గ్రామ పంచాయితీల్లో ఇంటిపన్నువసూలుకు మొబైల్ యాప్ ను ఆవిష్కరణ…

-ఈయాప్ తో ఆన్లైన్ ద్వారా నూరుశాతం ఇంటి పన్ను వసూలుకు అవకాశం -ఇంటిపన్ను చెల్లించిన వెంటనే రశీదు లబ్దిదారుకు వెళుతుంది -ఈవిధానంతో గ్రామ పంచాయితీల ఆర్ధిక పరిపుష్టికి అవకాశం -ఇప్పటికే సుమారు 86లక్షల ఇళ్ళ ఇంటిపన్ను డేటా సిద్దం -ఇకపై మాన్యువల్ విధానంలో ఇంటిపన్ను చెల్లింపు ఉండదు -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇకపై గ్రామ పంచాయితీలన్నిటిలో ఇంటిపన్ను వసూలును ఆన్లైన్ విధానంలో వసూలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి …

Read More »

అర్హులైన ప్రతి వ్యక్తికీ వైయస్సార్ ఫించన్ కానుక అందాలి అదే ప్రభుత్వ లక్ష్యం… : మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి వైయస్సార్ ఫించన్ కానుక అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయం మూడవ బ్లాకులో పంచాతీరాజ్ శాఖకు సంబంధంచి సెర్ప్ అధికారులతో సెర్ప్ అధికారులతో వివిధ పధకాల అమలుతీరుపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెర్ప్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.అర్హత కలిగిన ప్రతి వ్యక్తికీ వైయస్సార్ ఫించను …

Read More »

విజయవాడలో రెండు రోజుల పాటు ‘వాణిజ్య ఉత్సవం-2021’…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాణిజ్య ఎగుమతులను రెట్టింపు చేయడమే లక్ష్యంగా మంగళవారం ఏర్పాటు చేసిన ‘వాణిజ్య ఉత్సవం-2021’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం వాణిజ్య ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్‌ మ్యాప్‌ బ్రోచర్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ …

Read More »

ప్రజలు మీపై నమ్మకం, జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ విజయానికి కారణం…

పెనుమంట్ర , నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత గా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు తెలిపారు. పెనుమంట్ర మండలం జడ్పిటిసి గా ఎన్నికైనకర్రీ సుభాషిణి మంత్రిని గౌరవ పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు కర్రి సుభాషిణి ని అభినందించారు. ప్రజలు మీపై నమ్మకం, జగన్ మోహన్ రెడ్డి అమలు …

Read More »

పనే దైవం అనుకునేవారికి ఎప్పుడూ చేతినిండా పని… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పనే దైవం అనుకుంటే చాలు ఆలోచనలు, అవకాశాలు వెతుక్కొంటూ అవే వస్తాయిని, చేసే ఏ పనైనా దైవం అనుకునేవారికి ఎప్పుడూ చేతినిండా పని ఉంటుందని రాష్ట్ర రవాణా, సమాచార. పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్నివెంకట్రామయ్య (నాని) అన్నారు. మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని …

Read More »

మండలంలో వారానికి కనీసం 500 ఇళ్లకు నిర్మాణ సామాగ్రి అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి… : అధికారులకు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ మండలంలో వారానికి కనీసం 500 ఇళ్లకు నిర్మాణ సామాగ్రి అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వారానికి 500 ఇళ్లకు బేస్మెంట్ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ మండల అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ళు పథకంపై కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు , జగ్గయ్యపేట, వత్సవాయి పెనుగంచిప్రోలు, నందిగామ మండలాలకు చెందిన అధికారులతో మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ …

Read More »

అభివృద్ధి పనులు సత్వరమే చేపట్టాలని అధికారులకు సూచన…

-గాంధీ కొండ ను పరిశీలించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒన్ టౌన్ గాంధీజీ పర్వతం పై నగరపాలక సంస్థ చేపట్టవలసిన అభివృద్ధి పనులు అన్నియు సత్వరమే చేపట్టాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు సూచించారు. మంగళవారం కమిషనర్ అధికారులతో కలసి గాంధీ హిల్ ను పరిశీలిస్తూ, కాంపౌండ్ వాల్ నిర్మాణ మరియు పార్కింగ్ ప్రదేశాల ఏర్పాటు తదితర అంశాలతో పాటుగా కొండ పై భాగంలో జాయ్ ట్రైన్ కు తగిన మరమతులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా …

Read More »

ప్రణాళికతో పనిచేస్తేనే ఫలితాలు సాధిస్తాం కలెక్టర్ జె.నివాస్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే చక్కటి ఫలితాలు కూడా వస్తాయని నిరూపించారని కలెక్టర్ జె.నివాస్ ఇటీవల జరిగిన కౌంటింగ్ లో పాల్గొన్న అధికారులకు అభినందనలు తెలిపారు. మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల పూర్తయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ కొంటింగ్ లో ప్రణాళికాబద్ధంగా పనిచేసినందువల్లే అతితక్కువ సమయం ఉన్నప్పటికీ ఎలాంటి ఆరోపణలు రాకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయగలిగారన్నారు. అదే రీతిలో …

Read More »

సాముహిక ఎలుకల నిర్మూలన ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చు… : జిల్లా కలెక్టర్ జె.నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులందరూ సాముహికంగా ఒకేసారి ఎలుకల మందును ఉపయోగించి పంటను ఎలుకల నుండి కాపాడుకోవడం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవచ్చని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. మంగళవారం విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సాముహిక ఎలుకల నివారణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు మరియు పాంపులేట్లను జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత (రెవిన్యూ), విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చండీతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరి ఎక్కువుగా సాగవుతుందని, వరి పైరులో …

Read More »