Breaking News

ప్రజలు మీపై నమ్మకం, జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ విజయానికి కారణం…

పెనుమంట్ర , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత గా ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు తెలిపారు. పెనుమంట్ర మండలం జడ్పిటిసి గా ఎన్నికైనకర్రీ సుభాషిణి మంత్రిని గౌరవ పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ రాజు కర్రి సుభాషిణి ని అభినందించారు. ప్రజలు మీపై నమ్మకం, జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ విజయానికి కారణం అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందచెయ్యడం లోను, మండలాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లో తమదైన శైలిలో పనిచేసి ప్రజల ఆదరాభిమానాలు పొందాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *