Breaking News

Telangana

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో పోస్టులకు జనవరి 10లోగా దరఖాస్తు చేసుకోవాలి

-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ-ఐసీపీఎస్, శిశుగృహ, బాలసదన్లో కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్/పార్ట్ టైం పద్ధతిపై పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోస్టుల భర్తీకి సంబంధించి 2023, నవంబర్ 7న ఇచ్చిన నోటిఫికేషన్ లో వయసుకు సంబంధించి మార్పులు చేసినట్లు తెలిపారు. 18 నుంచి 42 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ …

Read More »

ఎకో స్పేస్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పటమట ఎకో స్పేస్ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరవై నివాసాలు కల ఈ సముదాయంలో నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని విభిన్న కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నా పెద్దా అంతా కలిసి వేడుకలలో పాలుపంచుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అదరహో అనిపించాయి. స్వాగత గీతం మొదలు సాంప్రదాయ, ఆధునిక నృత్యాల మేలు కలయికగా సాగిన వారి అభినయం అందరినీ అబ్బుర పరిచింది. శిక్షకుల సహాయం లేకుండానే అందుబాటులో ఉన్న …

Read More »

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి తానేటి వనిత

కొవ్వూరు,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంగ్ల నూతన సంవత్సరం – 2024ని పురస్కరించుకుని ప్రజలందరికీ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ఆమె అభిలాషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో …

Read More »

వైయస్ఆర్ పెన్షన్ కానుక రు.2750 నుంచి రూ.3 వేలకు పెంపు

-మండలాలు వారీగా వేడుకగా పెన్షన్ పంపిణీ జనవరి  1 నుంచి  6 వరకు షెడ్యూల్ -జిల్లాలో 2,48,083 మందికి  రు.73,64,447, 00 మేర ప్రయోజనం -కొత్తగా జిల్లాకు మరో 3,962 పెన్షన్లు మంజూరు -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక భద్రత కింద అందచేస్తున్న “వైఎస్ఆర్ పింఛను” కానుక జనవరి ఒకటి నుంచి మరో రూ 250 లు పెంచడం ద్వారా రూ.3  వేలను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు పూర్తి చేశామని జీల్లా కలెక్టర్ …

Read More »

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికీ 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

Read More »

ప్రత్యేక సిబ్బందిని పెంచి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పరిధిలో శనివారం రాత్రి నుండి నైట్ శానిటేషన్ నిర్వహణ మరియు ఆదివారం ఉదయం స్పెషల్ టీమ్స్ తో నగర పరిశుభ్రత జరుగుతున్న నేపథ్యంలో, విజయవాడ నగరవాసులు ఎటువంటి ఇబ్బందులు పాలవకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సిబ్బందిని పెంచి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచమని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ రత్నావళికి ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి …

Read More »

కొత్త సంవత్సర వేడుకలకు ప్లాట్‌ఫామ్ 65 నుంచి కొత్త బకెట్ బిర్యానీ

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలోని అతిపెద్ద టాయ్ ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ ప్లాట్‌ఫారమ్ 65, తన అన్ని శాఖలలో హాలీడే సీజన్ కోసం తన మెనూకు అద్భుతమైన జోడింపును ప్రకటించినందుకు ఆనందిస్తోంది. ప్రత్యేకంగా సమూహ సమావేశాల కోసం రూపొందించిన కొత్త బకెట్ బిర్యానీలను ప్లాట్‌ఫామ్ 65 పరిచయం చేస్తోంది, ఇది టేక్‌అవేకి మరియు నూతన సంవత్సర వేడుకల ఆనందాన్ని పంచుకోవడానికి అనువైనది. ప్లాట్‌ఫామ్ 65 జంబో ప్యాక్‌ని పరిచయం చేస్తోంది. ఇది 5 నుండి 8 మంది వ్యక్తుల సమూహాలకు సరైంది. ప్లాట్‌ఫామ్ …

Read More »

జిల్లా ప్రజలకు 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్తు, అటవీ భూగర్భ గనుల శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర పర్యాటక, యువజన క్రీడా శాఖామాత్యులు ఆర్.కె. రోజా, కలెక్టర్, ఎస్పీ, జెసి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కె.నారాయణ స్వామి , రాష్ట్ర విద్యుత్తు, అటవీ భూగర్భ గనుల శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరియు రాష్ట్ర పర్యాటక, యువజన క్రీడా శాఖామాత్యులు ఆర్.కె. …

Read More »

ఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కంటిన్యూషన్ స్టోరీ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : – కొత్త సంవత్సరం నేపథ్యంలో పెన్షన్ రూ.3వేలకు పెంపు. – విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ.3వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చిన వైయస్‌.జగన్. వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక కింద ఠంచనుగా పెన్షన్. ఇకపై ప్రతినెలా రూ. ౩వేలకు పెన్షన్. – 2014-19లో గత పాలనలో పెన్షన్‌ రూ.1000 – జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు. – జనవరి 2022న రూ.2,500కు పెన్షన్‌ పెంపు. – జనవరి …

Read More »

2023 అభివృద్ధి నామ సంవత్సరంగా మిగిలిపోతుంది

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 2.60 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2023 ఏడాది సెంట్రల్ నియోజకవర్గ చరిత్రలో అభివృద్ధి నామ సంవత్సరంగా మిగిలిపోతుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ. 2.60 కోట్ల అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు ఇసరపు దేవి, ఉమ్మడి రమాదేవి, మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభోత్సవాలు నిర్వహించారు. …

Read More »