Breaking News

ప్రత్యేక సిబ్బందిని పెంచి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచండి

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పరిధిలో శనివారం రాత్రి నుండి నైట్ శానిటేషన్ నిర్వహణ మరియు ఆదివారం ఉదయం స్పెషల్ టీమ్స్ తో నగర పరిశుభ్రత జరుగుతున్న నేపథ్యంలో, విజయవాడ నగరవాసులు ఎటువంటి ఇబ్బందులు పాలవకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సిబ్బందిని పెంచి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచమని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ రత్నావళికి ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆదివారం ఉదయం తన పర్యటనలో భాగంగా 40 డివిజన్ ఆర్టీసీ డిపో ఏరియా, 24వ డివిజన్ శాతవాహన కాలేజ్ ప్రాంతం, పదవ డివిజన్ ఫన్ టైమ్స్ రోడ్డు ప్రాంతం, మూడవ డివిజన్ కనకదుర్గ నగర్ ప్రాంతాలు పరిశీలించారు. ప్రత్యేక సిబ్బందిని పెంచి నగరాన్ని పరిశుభ్రపరచవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న మూడు నియోజకవర్గాలలో 651 బ్లాక్ స్పాట్స్ (ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రధాన ప్రాంతాలు) మరియు లీగసి వేస్ట్ పాయింట్స ని గుర్తించామని కార్పొరేషన్ సిబ్బంది మరియు ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పారిశుద్ధ నిర్వహణలో నిమగ్నమై ఉన్నారని, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా చెత్త తరలింపు వాహనాలతో దాదాపు 250 కు పైగా ట్రిప్పులలో చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్ కు పంపించామని అన్నారు. నగర పౌరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ పనిచేస్తుందని అన్నారు. నిర్విరామంగా నగర పరిశుభ్రత జరగాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *