అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి రఘురామ కృష్ణం రాజు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ని కలిసిన వారిలో శాసనసభ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు తాతంశెట్టి నాగేంద్ర, గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News