Breaking News

ఏపీ సాంస్కృతిక ప్రతిపాదనలపై కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నెల రోజుల్లోనే సర్క్యులర్ జారీకి హామీ:మంత్రి కందుల దుర్గేష్

-ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌తో మంత్రి కందుల దుర్గేష్ కీలక భేటీ.. ఏపీ సాంస్కృతిక ప్రతిపాదనలపై కేంద్రం సానుకూల స్పందన
-ఏపీ టూరిజంలో పెట్టుబడులకు ‘భరోసా’ మాది.. ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ హామీ..ఏపీకి రావాలని ఫెయిత్ టూరిజం కాన్ క్లేవ్ -2026 వేదికగా పిలుపు
-రాజమహేంద్రవరం, విజయవాడ, కడపలకు గుడ్ న్యూస్.. సాంస్కృతిక హబ్‌లుగా మారనున్న ఆయా నగరాలు..నిరంతర ఫాలోఅప్‌తో ప్రతిపాదనలు సాధించిన మంత్రి కందుల దుర్గేష్
-రెండోరోజు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన మంత్రి కందుల దుర్గేష్..పలువురు జాతీయ,అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో ప్రత్యేక భేటీ

న్యూఢిల్లీ/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడమే ధ్యేయంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ విజయవంతంగా కొనసాగిస్తున్న న్యూఢిల్లీ పర్యటనలో మరో కీలక అడుగు పడింది.రెండో రోజు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్‌తో మంత్రి కందుల దుర్గేష్ కీలక భేటీ అయి ఏపీ సాంస్కృతిక రంగానికి మహర్దశ చేకూర్చే 5 అత్యంత కీలకమైన పెండింగ్ ప్రతిపాదనల నివేదికను సమర్పించారు.రాష్ట్ర ప్రభుత్వ నిరంతర ప్రత్యేక ఫాలోఅప్ నేపథ్యంలో ఈ ప్రతిపాదనలపై కేంద్ర కార్యదర్శి వివేక్ అగర్వాల్ అత్యంత సానుకూలంగా స్పందించారు. వీటికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి నెల రోజుల్లోనే స్పష్టమైన రూపాన్ని తీసుకువస్తామని, త్వరలోనే అధికారిక సర్క్యులర్‌ను జారీ చేస్తామని మంత్రి కందుల దుర్గేష్‌కు కేంద్ర కార్యదర్శి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ పరిణామాల పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్ త్వరలోనే రాష్ట్ర సాంస్కృతిక రంగానికి మహర్దశ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి దుర్గేష్ సమర్పించిన ప్రతిపాదనల్లో చారిత్రక, సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్’కేంద్రాన్ని నెలకొల్పడం, ఏపీలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించడం,విజయవాడ లోని జి.వి.ఆర్ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో అత్యాధునిక ‘కళాక్షేత్ర ఆడిటోరియం’ నిర్మాణం చేపట్టడం, కడప లో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు మరియు కళలకు పునర్వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. తమ విజ్ఞప్తులకు కేంద్రం తక్షణమే స్పందించి, నెల రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇవ్వడం రాష్ట్ర కళాకారులందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

అంతకుముందు దేశ రాజధానిలో జరుగుతున్న ప్రతిష్టాత్మక “ఫెయిత్ టూరిజం కాన్‌క్లేవ్-2026” లో రెండో రోజు పాల్గొన్న మంత్రి దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించారు.ఈ సందర్భంగా కాన్‌క్లేవ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీ టూరిజం స్టాల్‌ను మంత్రి దుర్గేష్ సందర్శించారు. స్టాల్‌ను సందర్శించిన పలువురు ప్రముఖులకు, సందర్శకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగ విశిష్టతలను, చారిత్రక, ఆధ్యాత్మిక వైభవాన్ని ఆయన స్వయంగా వివరించారు.ఉదయం సెషన్‌లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ పలువురు జాతీయ, అంతర్జాతీయ పర్యాటక రంగ ప్రతినిధులు, ఇన్వెస్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వారికి వివరించి, భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానించారు. మంత్రి దుర్గేష్ తో పాటు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఏపీ పర్యాటక రంగ పెట్టుబడులపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *