Breaking News

పదిేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 22-ఎ భూ సమస్యకు పరిష్కారం

-పీజీఆర్ఎస్ ద్వారా వేములూరు గ్రామస్తులకు ఊరట
-కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో దశాబ్దకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న 22-ఎ నిషేధిత భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.

శుక్రవారం సాయంత్రం వేములూరు గ్రామస్తులు కలెక్టర్‌ను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, వేములూరు గ్రామస్తులు కొవ్వూరులో నిర్వహించిన పీజీఆర్ఎస్, “ఒక నెల–ఒక నియోజకవర్గం” కార్యక్రమాల ద్వారా వినతిపత్రాలు సమర్పించగా రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి సమస్యను పరిష్కరించారని చెప్పారు. వేములూరు గ్రామంలోని సర్వే నంబర్ 170/4లో దేవాదాయ శాఖకు చెందిన కేవలం 0.10 ఎకరాల భూమి మాత్రమే ఉండగా, అదే సర్వే నంబర్ కారణంగా మొత్తం 16.31 ఎకరాల గ్రామకంఠం భూమి 22-ఎ నిషేధిత జాబితాలో ఉండటంతో గ్రామస్తులు రిజిస్ట్రేషన్లు, కొనుగోలు, విక్రయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వివరించారు.
క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం దేవాదాయ శాఖకు చెందిన సర్వే నంబర్ 170/4C2లోని 0.10 ఎకరాలను మాత్రమే 22-ఎ నిషేధిత జాబితాలో కొనసాగిస్తూ, మిగిలిన గ్రామకంఠం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ అధికారిక రికార్డులతో పాటు ఆన్‌లైన్ నమోదుల్లోనూ ఈ మార్పులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితాలు సాధ్యమవుతాయని ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సమస్య పరిష్కారంలో కీలకంగా పనిచేసిన కొవ్వూరు ఆర్డీవో కె. ఆనందరావు, తహసీల్దార్ డి. దుర్గాప్రసాద్, సంబంధిత వీఆర్వోల పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.

గ్రామస్తుల తరఫున బాదరాల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారం లభించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో గ్రామ ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడిందన్నారు. PGRS లో అర్జీలకు పరిష్కారం లభిస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని తెలిపారు. అదే విధంగా అధికారులు కూడా జవాబుదారితనం కలిగి ఉండడం పట్ల తమ వంతు గా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె ఆనంద రావు, తహసిల్దార్ డి దుర్గాప్రసాద్, వెములూరు గ్రామస్థులు మానే సత్యనారాయణ, మానే వీరవెంకట సత్యనారాయణ, మానే శ్రీనివాస్, మద్దిపాటి నాగేశ్వరరావు, జుజ్జవరపు బలరామకృష్ణ, ఇందుకూరి సుబ్బరాజు, నక్కా గంగారావు, అత్తులూరి శ్రీనివాస్, వేములూరు వి ఆర్ వో తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *