Breaking News

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి:సిఎస్ సాయిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగష్టు 15వ తేదీన నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 అనే నినాదంతో(Theme)నిర్వహించనున్న రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.రాజధాని ప్రాంతంలోని ప్రస్తుత పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు,పధకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ప్రత్యేక శకటాల ప్రదర్శనకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్.సాయి ప్రసాద్ ఆదేశించారు.ముఖ్యంగా ఇప్పటి వరకూ ఆయా శాఖల ద్వారా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఏవిధమైన చర్యలు తీసుకున్నారు సాధించిన ప్రగతిని వివరించడంతో పాటు రానున్న రోజుల్లో చేపట్టనున్న కార్యక్రమాలు తద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలు ప్రతిబించే రీతిలో ఆయా శకటాలు ఏర్పాటు ఉండాలని స్పష్టం చేశారు.ఇందుకు సంబంధించి సమాచార శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాధన్ ను ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని మెరుగైన రీతిలో శకటాల ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అందరు అఖిల భారత సర్వీసుల అధికారులు సహా అన్ని శాఖల అధికారులు,ఉద్యోగులు తప్పని సరిగా హాజరు కావాలని ఈవిషయంలో ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. వేడుకల ప్రాంగణంలో తగిన ఏర్పాట్లు చేయాలని సిఆర్డిఏ,గుంటూరు జిల్లా కలక్టర్ సహా పలువురు అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పధకాలపై ముఖ్య అతిధి వారి సందేశం తయారు చేయడం,మెరైగైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు,కామెంటేటర్లను సిద్ధం చేయడం,హోర్డింగ్లు ఏర్పాటు వంటి అంశాల్లో సమచార శాఖ డైరెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ సమావేశంలో జిఏడి ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు రానున్న స్వాతంత్ర్య దినోత్స వేడుకలకు వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.పోలీస్ శాఖ తరుపున తగిన బందోబస్తు,పార్కింగ్ వంటి ఇతర ఏర్పాట్లు సక్రమంగా చేయాలని సూచించారు.గుంటూరు జిల్లా కలక్టర్ ఓవర్ ఆల్ ఇంచార్జిగా వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించాలని చెప్పారు.సిఆర్డిఏ అధికార్లు వేదిక ప్రాంగణాన్ని అన్ని విధాలా సన్నద్ధం చేయాలని సూచించారు.ఇంకా సంబంధిత శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈసమావేశంలో ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్,ఐజి రాజ కుమారి, సమాచార శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్,అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థ సారథి,గుంటూరు జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ,ఎస్పి వకుల్ జిందాల్, సిఆర్డిఏ అదనపు కమీషనర్ భార్గవ్ తేజ ఇతర అధికారులు పాల్గొన్నారు.అదే విధంగా వర్చువల్ గా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *