Breaking News

Uncategorized

గణపవరం గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్న ద్వారావతి ఫౌండేషన్… : సంతోష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు గాను మైలవరం మండలం గణపవరం గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ద్వారావతి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి గాను దాతలు నుండి విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా మైలవరం లోని లక్కీ రెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం మహా రుద్రాభిషేకం నిర్వహించినట్టు చెప్పారు. ఆసుపత్రి నిర్మాణానికి చలవాది మల్లికార్జున రావు స్థలాన్ని దానం చేశారన్నారు.

Read More »

కాంతి రాణా టాటా కు జిల్లా కలెక్టర్ జె నివాస్ శుభా కాంక్షలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నగర పోలీస్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కాంతి రాణా టాటా కు జిల్లా కలెక్టర్ జె నివాస్ శుభా కాంక్షలు తెలిపారు. గురువారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కాంతి రాణాను మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్ జె.నివాస్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. పోలీస్,రెవెన్యూ,ఇతర అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి జిల్లా ను ప్రగతి పథంలో వుంచదమని కమీషనర్ అన్నారు.సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ కూడా నగర పోలీస్ కమిషనర్ …

Read More »

జర్నలిస్టులు రోడ్డున పడితే… రాజ్యాంగం రోడ్డున పడినట్లే…

-జర్నలిస్టుల నిరసన దీక్షలో నేతల మద్దతు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీయూడబ్య్లూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టుల నిరసన దీక్ష జరిగింది. ఈ కార్యక్రమాన్ని సీనియర్‌ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి వి.కె. ఎం. తిలక్ ప్రారంభించారు. అతిధులుగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జయరాజ్ పాల్గొన్నారు. అర్బన్ అధ్యక్షులు చావారవి, రూరల్ అధ్యక్షులు వెంకట్రావు,ప్రెస్ క్లబ్ …

Read More »

అర్హత పత్రములతో ఇంటర్వ్యూనకు హాజరు కావలెను…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నందు వివిధ ఖాళీలను అవుట్ సోర్సింగ్ పద్దతిలో APCOS ద్వారా భర్తీ చేయుటకు ది.04.09.2021 తేదిన వార్తా పత్రికల నందు నోటిఫికేషన్ ప్రచురించడమైనది. సదరు ప్రక్రియలో భాగంగా ది.28.10.2021 మరియు 29.10.2021 తేదీలలో ఈ దిగువ తెలిపిన ప్రదేశాలలో ఇంటర్వ్యూ లు మరియు సర్టిఫికెట్స్ వెరిఫీకేషన్ నిర్వహించబడును. 1. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ కొత్త బిల్డింగ్ 2. ఐ.వి.ప్యాలస్ గవర్నర్ పేట మొదటి అంతస్తు. 3. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (యోగా …

Read More »

గుడివాడ ప్రభుత్వ ఐటీఐలో వివిధట్రైడుల్లోని సీట్లు భర్తీకి సంబందించి మూడవ విడత కౌన్సిలింగ్ కు దరఖాస్తులు ఆహ్వానించడమైనది…

-ప్రిన్స్ పాల్ వి. శ్రీనివాసరాజు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2021-22 విద్యా సంవత్సరానికి గాను గుడివాడ కె.బి.ఆర్. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో వివిధ ట్రేడులలో ఖాళీ ఉన్న సీట్ల ప్రవేశానికి సంబందించి మూడవ విడతలో ఈనెల 11 వ తేదీ నుంచి 26 వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించడమైనదని గుడివాడ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్స్ పాల్ వి. శ్రీనివాసరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేబిఆర్ ప్రభుత్వం ఐటిఐలో చేరు అభ్యర్థులు https://iti.nic.in ద్వారా …

Read More »

జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్, కో-అప్లైడ్ సభ్యుల ఎన్నికకు ప్రత్యేక సమావేశం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక సమావేశం ఈనెల 25వ తేదీ శనివారం ఉ.10 గం.లకు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో జరుగుతుందని జిల్లా పరిషత్ సిఇఓ పిఎస్.సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్స్ ఎన్నిక జరుగుతుందని ఈ ఎన్నికకు జిల్లా కలెక్టర్ మరియు జడ్ పి ప్రత్యేక అధికారి జె.నివాస్ ప్రిసైడింగ్ అధికారిగా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ మురళీధర్ రెడ్డి ఈ …

Read More »

286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్‌… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని, న‌గ‌రంలో 18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన అంద‌రూ వ్యాక్సినేష‌న్ వేయించుకొవాలని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. శ‌నివారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌త్యేక స‌ర్వ‌స‌భ స‌మావేశంలో ఐదుగురు స‌భ్యుల ఎన్నిక అనంత‌రం క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ కార్పొరేట‌ర్లు వ్యాక్సిన్ పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు. న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాలలో 286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే శాశ్వ‌త …

Read More »

మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా విద్యారంగం…

-పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారుతున్న సామాజిక, సాంకేతిక పోటీకి అనుగుణంగా ప్రత్యేక వ్యూహాలతో విద్యా రంగం ముందుకు సాగవలసి ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. భవిష్యత్తు సవాళ్లను అధికమించే క్రమంలో విద్యావేత్తలు, సమాజం నడుమ అవగాహన అవసరమన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం బుధవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ కులపతి హోదాలో విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వెబినార్ విధానంలో ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ …

Read More »

సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తోంది … : కేశినేని నాని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడలో ఆదివారం 19వ డివిజన్‌ టీడీపీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనే చెప్పామని, ప్రజలు …

Read More »

11న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో, పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర బిహార్‌ నుంచి ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఝార్ఖండ్‌ నుంచి ఇంటీరియర్‌ ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతోంది. ‘ఉపరితల ద్రోణి ప్రభావంతో గురు శుక్రవారాల్లో కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు …

Read More »