-నియోజక వర్గాల వారీగా కేటాయింపు -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 4 వ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో పాలైన ఓట్లు లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బందిని నియోజక వర్గాల వారీగా కేటాయింపులు చెయ్యడం జరిగిందనీ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల కౌంటింగ్ పరిశీలకుల బీజై కుమార్ కందయాత్ రాయ్, టాన్ సింగ్ జి. మోమిన్ సమక్షంలో ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: June 1, 2024
జూన్ 4 నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి
-కౌంటింగ్ కేంద్రం లోకి అనుమతించే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు జారీ -ఈవిఎమ్ ,పోస్టల్ బ్యాలెట్, ఈటిపిబిఎస్ ఓట్లు లెక్కింపు అనుగుణంగా చర్యలు -ఈవిఎమ్ ఓట్ల కోసం పిసి పరిధిలో 98 టేబుల్స్ 116 రౌండ్స్ , ఏసి పరిధిలో 98 టేబుల్స్ 116 రౌండ్స్, -ఈటిపీబిఎస్, పోస్టల్ బ్యాలెట్ కోసం 18 టేబుల్స్ ఏర్పాటు -ఓట్ల లెక్కింపు కోసం తగిన 2500 మంది మానవ వనరుల సిద్ధం చేశాం -కౌంటింగ్ సందర్భంలో కేంద్ర,రాష్ట్ర జిల్లా స్థాయిలో మూడంచెల భద్రత ఏర్పాట్లు -గుర్తింపు కార్డు …
Read More »డిసిహెచ్ఎస్ గా పద్మశ్రీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కో-ఆర్డినేటర్ డా ఎన్ పి పద్మశ్రీ జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత శనివారం కలెక్టర్ ఛాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కో-ఆర్డినేటర్ డా ఎమ్. సనత్ కుమారి చక్కటి పనితీరు కనపర్చడం జరిగిందనీ, అదే విధంగా మరింత మెరుగ్గా బాధ్యతలను నిర్వర్తించి ప్రజలకి వైద్య సేవలు అందించే క్రమంలో ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకోవడం ద్వారా …
Read More »సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం మండలం, జూపూడిలోని నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల స్ట్రాంగ్ రూమ్స్ మరియు కౌంటింగ్ ను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాలలో మూడు అంచెల విధానంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ది.04.06.2024 తేదిన జరుగు సార్వత్రిక ఎన్నికల …
Read More »ఎగ్జిట్ పోల్స్ పై కేశినేని శివనాథ్ హర్షం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజల తీర్పు ఎటువైపు వుందనే విషయం తెటతెల్లమైపోయింది. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి 21 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే…అందులో దాదాపు 18 సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని ప్రకటించాయని టిడిపి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) హర్షం వ్యక్తం చేశారు. వివిధ మీడియా హౌసులు, సర్వే సంస్థలు శనివారం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో కేశినేని …
Read More »పోరంకి లోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నమంత్రి జోగి రమేష్
పోరంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలోని సుప్రసిద్ధ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్నిశనివారం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read More »సకాలంలో ఫలితాలు ప్రకటించుటకు అన్ని చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓట్ల లెక్కింపు పటిష్టవంతంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు ప్రకటించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు చేపట్టమన్న దృష్ట్యా, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో శనివారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ సిబ్బంది రెండవ రాండమైజేషన్ నిర్వహించి …
Read More »ఈవిఎం స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పోల్డ్ ఈవిఎం లు భద్రపరచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను, కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం సదరు స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడుతూ స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లు 24X7 అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల …
Read More »హనుమజ్జయంతి నాకెంతో ప్రియమైన రోజు
-మాచవరం దాసాంజనేయుని సేవలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అతులిత బలధాముడు, అంజనీదేవి పుత్రుడు, జ్ఞానులలో అగ్రగణ్యుడు, సకల గుణ సంపన్నుడైన శ్రీ హనుమానుని జయంతి తనకెంతో ప్రీతికరమైన రోజు అని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాలు శనివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారు జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రసన్నం చేసుకున్నారు. ఈ సందర్భంగా …
Read More »టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
-ఎన్నికల సంఘాన్ని కోరిన వైసీపీ బృందం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టించేలా తెలుగుదేశం కౌంటింగ్ ఏజంట్లను రెచ్చగొడుతున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు శనివారం వెలగపూడి సచివాలయం నందు డిప్యూటీ సీఈఓ విశ్వేశ్వరరావును కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని మల్లాది విష్ణు ఆరోపించారు. తెలుగుదేశం కౌంటింగ్ ఏజంట్లకు ట్రైనింగ్ క్యాంపులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే …
Read More »