విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజల తీర్పు ఎటువైపు వుందనే విషయం తెటతెల్లమైపోయింది. లోకసభ, అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి 21 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తే…అందులో దాదాపు 18 సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతుందని ప్రకటించాయని టిడిపి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) హర్షం వ్యక్తం చేశారు.
వివిధ మీడియా హౌసులు, సర్వే సంస్థలు శనివారం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన తర్వాత గురునానక్ కాలనీ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో కేశినేని శివనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే సంస్థలు ఎనౌన్స్ చేసిన ఫలితాల కు మించి ఎన్టీయే కూటమి ఫలితాలు వుండబోతున్నాయన్నారు. ఎన్డీయే కూటమికి జనాదరణ ఏ స్థాయిలో వుందో జూన్ 4వ తేదీ తెలుస్తుందని చెప్పారు.
జగన్ సొంత సంస్థలు చేసిన సర్వే మినహా…వైసిపి గెలుస్తుందని ఏ సర్వే చెప్పలేదు..18 సంస్థలు ఎన్టీయే కూటమి గెలుస్తుందనే చెప్పాయని ఆనందం వ్యక్తం చేశారు. జగన్ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొని వుందని, ప్రస్తుతం ఆపార్టీ కి కౌంటింగ్ ఏజెంట్లు దొరకని పరిస్థితిలో వున్నారని తెలిపారు. ఎన్డీయే కూటమి అంచనాలు నిజమైయ్యాయని, టిడిపి శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలు జూన్ 4వ తేదీ సాయంత్రం దీపావళి జరుపుకోబోతున్నారని , రాష్ట్రం నరకాసుర చెర నుంచి బయట పడనుందన్నారు. చంద్రబాబు నాయుడ్ని మరోసారి ముఖ్యమంత్రి గా అసెంబ్లీకి పంపించబోతున్నందుకు రాష్ట్ర ప్రజలకు కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దళితరత్న పరిశపోగు రాజేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఎమ్.డి. ఇర్ఫాన్, ఎన్టీఆర్ జిల్లా గౌడ సాధికార సంఘం కన్వీనర్ పామర్తి కిషోర్, తెలుగు దేశం పార్టీ నాయకులు ఆర్.శివప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News